హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కేసీఆర్
హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్సేన్ గుప్తాతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ రోజు సమావేశమయ్యారు. వారు హైకోర్టు విభజనపై చర్చించారు. హైకోర్టు విభజన కోరుతూ కేసీఆర్ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తీర్మానాన్ని కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సభ్యులు బలపరిచారు. హైకోర్టు విభజన కోరుతూ సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు..
ఈ నేపధ్యంలో కేసీఆర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్సేన్ గుప్తాను కలిసి, హైకోర్టు విభజన గురించి చర్చించారు.