గోదావరి జలాలతో ఒక్క వర్ధన్నపేట నియోజకవర్గంలోనే 11 వేల ఎకరాలు తడుస్తోంది. 24 గంటల కరెంటుతో గజం భూమి కూడా ఎంyì పోట్లేదు. రైతు బీమా, రైతు బంధు, సకాలంలో ఎరువులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పింఛన్లు ఇవి చాలవా ప్రజలు తిరిగి మాకు పట్టం కట్టడానికి.. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టింది.. నా నియోజకవర్గం నుంచే ఈ ఏడాది రూ.520 కోట్ల విలువైన ధాన్యం దిగుబడి వచ్చిందని వర్ధన్నపేట టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి, తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచార బిజీలో ఉన్న ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
–వర్ధన్నపేట
వర్ధన్నపేట నియోజకవర్గంలో దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారు 11 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కాల్వల కింద 38 చెరువులు నింపుతున్నాం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. వీటి ద్వారా సుమారు 5వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఇక ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారు 6వేల సాగు నీరు అందుతుంది. నియోజకవర్గంలో 32 చెరువులు నింపుతున్నారు. హసన్‌పర్తి, హన్మకొండ, వరంగల్, ఐనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని చెరువుల్లో ఎస్సారెస్పీ నీటిని మళ్లిస్తున్నారు. గతంలో వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఎస్సారెస్పీ జలాలు అందలేదు.
నాకున్న సమాచారం మేరకు ఈ ఏడాది రూ.520 కోట్ల విలువైన పంట దిగుబడి వచ్చింది. ప్రతి రైతు ఇంట చిరునవ్వులే ఉన్నాయి. డబుల్ బెడ్‌రూం పథకం పనుల వేగం ఇప్పుడిప్పుడే అందుకుంటోంది. వరంగల్ రెవెన్యూ మండలం ఎస్సార్‌నగర్‌లో సుమారు 800 ఇళ్లు. హసన్çపర్తి మండలం సిద్ధాపురం, అర్వపల్లిల్లో 40 డబుల్‌బెడ్ రూం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. కాట్య్రాలపల్లి 28 డబుల్ బెడ్‌రూంల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. చింత నెక్కొండ 60డబుల్ బెడ్‌రూంలు, తుర్కల సోమారంలో 30 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే వ్యక్తిగత ప్లాట్లలో కూడా ఇళ్ల నిర్మాణం చేయడంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన వందల కొద్ది సంక్షేమ పథకాలు ఇవాల ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నాయి.
ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌కు నిధులు, బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్‌కు నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కరెంటు చార్జీలు పెంచకుండా చేయడం వంటి సంక్షేమ పథకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల కరెంటు, రూ.లక్ష రుణమాఫి, రూ.వెయ్యి పింఛన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వీర్యమైన యువత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కృషి ఫలితంగా సంపదను సృష్టించగలుగుతోంది. నేను గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రజల మధ్యనే ఉంటున్నాను. వాళ్ల కష్టం, వాళ్ల సుఖం నాది అనుకొని జనంలో తిరుగుతున్నాను. ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు. విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు దృష్టి పెట్టాను. ఈ దఫా విలీన గ్రామాలను అభివృద్ధి చేసి తీరుతా.
Comments
Please login to add a commentAdd a comment