aroori ramesh
-
వరంగల్ లో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు
-
లోక్ సభ ఎన్నికల్లో కావ్య భారీ మెజారిటీతో గెలుస్తారు: శ్రీహరి
-
ముగిసిన మాజీ MLA ఆరూరి రమేష్ ఎపిసోడ్
-
కేసీఆర్ నివాసంలో ముగిసిన వరంగల్ నేతల భేటీ
-
ఆరూరి కోసం కొట్లాట.. చిరిగిన చొక్కా
-
ఆరూరి కోసం కొట్లాట.. చిరిగిన చొక్కా
హనుమకొండ, సాక్షి: నగరంలో ఇవాళ పొలిటికల్ హైవోల్టేజ్ హైడ్రామా నడిచింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ను వీడి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సీనియర్ నేత హరీష్‌రావు ఆదేశాల మేరకు బస్వరాజు సారయ్య, సుందర్ రాజ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు బుధవారం ఉదయం ప్రశాంత్‌నగర్‌లోని ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్మీట్లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. హరీష్‌రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ.. ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడించారు. కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్దిచెప్పే యత్నం చేశారు. ఆ సమయంలో.. ఆరూరి అనుచరులు బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు బలవంతంగా ఆరూరిని బుజ్జగించే యత్నం చేశారు. ‘‘చివరి నిమిషంలో వస్తే ఎలా?’’ అని ఆరూరి ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టకున్నారు. అయితే హరీష్‌రావు సాయంత్రం వచ్చి అన్నీ మాట్లాడతారంటూ ఆరూరితో చెప్పారు వాళ్లు. అలా వాళ్లతో మాట్లాడిన కాసేపటికి అక్కడికి వచ్చిన ఎర్రబెల్లి కారులో ఆరూరి ఎక్కారు. అయితే ఆ సమయంలోనూ ఆరూరి అనుచరులు ఆ వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆరూరి నిలువరించడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వరంగల్ ఎంపీ సీటు కండిషన్‌పై బీజేపీలో చేరేందుకు ఆరూరి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆరూరిని కిడ్నాప్ చేశారు ఆరూరి రమేష్‌ను తమ వెంట బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లడంపై బీజేపీ నేత రావు పద్మ స్పందించారు. ఆయన్ని బీఆర్ఎస్ కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తున్నారామె. ‘‘ఆరూరి బీజేపీలో చేరతానని నిన్న స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశాక.. ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకుంటానని అన్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదు’’ అని పద్మ మండిపడ్డారు. పెంబర్తిలో ఉద్రిక్తత జనగాం జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరూరిని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు ఆయన్ని తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించాయి. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కారు నుంచి ఆరూరిని బయటకు లాగేందుకు బీజేపీ నేతలు యత్నించారు. అయితే బీఆర్ఎస్ నేతలు సైతం ఆరూరిని లాగేయడంతో.. జరిగిన తోపులాటలో ఆరూరి చొక్కా చినిగిపోయింది. ఎలాగోలా వాహనం నుంచి బయటకు వచ్చిన ఆరూరిని .. ఇరు వర్గాలు తమ తమ నేతలకు ఫోన్లు కలిపి కోరుతున్న దృశ్యాలు అక్కడ కనిపించాయి. -
బీఆర్ఎస్కు భారీ షాక్.. బీజేపీలోకి మరో గులాబీ మాజీ ఎమ్మెల్యే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో బీఆర్ఎస్కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. గులాబీ పార్టీకి చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా చేసి సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్మున్షీ తదితరులను కలిశారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కొందరు పీఏసీసీఎస్ అధ్యక్షులు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా, మంగళవారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్‌స్థాయి అధ్యక్షుల విజయ సంకల్పసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు మార్తినేని ధర్మారావు తదితరులతో అరూరి రమేష్ హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్లో అమిత్‌షాను కలిశారు. కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడిన అనంతరం బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతల తీరుపై అసంతృప్తితోనే.. బీఆర్ఎస్లో కీలకంగా మారిన కొందరు నేతల తీరుపై అసంతృప్తితోనే అరూరి రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలోనే ఉంటూ ద్రోహం చేసిన వారే ఇప్పుడు మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్ ఇస్తామని చెబుతూనే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని కనీసం నియంత్రించడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుంటున్న తనను జిల్లాకు చెందిన ఓ నాయకుడు నిత్యం సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడని, పార్టీ శ్రేణుల వద్ద తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడంటూ పేర్కొన్నారు. అధిష్టానానికి నివేదించినా కట్టడి చేసే ప్రయత్నం చేయలేదని మనస్తాపం చెందిన ఆయన.. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుండటం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాజీనామాకు కారణాలు నేడు వెల్లడి.. ఐటీసీ కాకతీయ హోటల్లో అమిత్‌షాతో భేటీ అయిన అరూరి రమేష్.. అ తర్వాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కూడా సుమారు అరగంట ఏకాంతంగా మాట్లాడినట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆయన ఈ మేరకు బీఆర్ఎస్కు, వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేయనున్నారు. ఉదయం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తన రాజీనామాకు కారణాలు, పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓటమి చెందిన ఆయన వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో మొదట కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో చర్చలు జరిపి ఆ తర్వాత అమిత్‌షాను కలిసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా బీజేపీలోకి అరూరి రమేష్‌ను ఆహ్వానించినట్లు తెలిసింది. -
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ: అందుకు మోదీ కారణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శాసనసభ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం వాయిదా పడనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఎంఐఎం ఎమ్మెల్యే ముజాంఖాన్ చర్చ ప్రారంభించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఆర్ధిక మాంద్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని వెలికితీయలేకపోయిందని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కేంద్రం తీరు ఉందని దుయ్యబట్టారు. ఈ నెల 9న 2019-20 వార్షిక బడ్జెట్‌ను కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత.. 14వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. 14న తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ వివిధ శాఖల పద్దులపై ఎనిమిది రోజులుగా చర్చించి ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల చివరి రోజున శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శాసనసభ కమిటీలను ప్రకటించనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, అండర్ టేకింగ్స్ కమిటీ వంటి ఆర్థిక కమిటీలతో పాటు అసెంబ్లీలో మొత్తం 21 కమిటీలు ఉంటాయి. కీలకమైన ప్రజా పద్దులు కమిటీ పదవిని శాసనసభలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న ఎంఐఎం ఆశిస్తోంది. -
వర్ధన్నపేటను సిద్ధిపేటలా చేస్తా.. తన్నీరు హరీష్‌రావు
సాక్షి, వరంగల్ రూరల్/వర్ధన్నపేట: ఎన్నికల్లో వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌కు రాష్ట్రంలోనే నంబర్ వన్ మెజార్టీ ఇస్తే దత్తత తీసుకుని, వర్ధన్నపేటను సిద్ధిపేట మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తా అని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తే గత నా మెజార్టీ దాటిపోయేలా ఉందన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే తనకు నంబర్ వన్ మెజార్టీ వస్తే.. రెండో మెజార్టీ రమేశ్‌కు వచ్చిందన్నారు. వర్ధన్నపేటలోని ఇల్లందలో ప్రజాఅశ్వీరాద సభ టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో రమేశ్ ఏం అభివృద్ధి చేయకముందే 87 వేల మెజార్టీని ఇచ్చారని, రూ.కోట్లాది నిధులను తీసుకొచ్చి వర్ధన్నపేటను అభివృద్ధి చేసిన అరూరి రమేశ్‌కు ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ దాటుందని నమ్మకం ఉందన్నారు. వర్ధన్నపేటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. రెండు పంటలకు నీరందేలా కృషి చేస్తాన్నారు. ఆకేరు వాగు వెనక ప్రాంతానికి సైతం సాగు నీటిని అందిస్తాన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గర్భిణులు కాన్పుకు పోతే రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చయ్యేవని, అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు అందించి ఉచితంగా కాన్పు చేసి కేసీఆర్ కిట్‌తోపాటు రూ.12 వేలు ఇచ్చి వ్యాన్‌లో ఇంటికి సురక్షితంగా పంపిస్తున్నారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణను తెచ్చుకున్నామని, పరాయి పాలనలో అబివృద్ధి కుంటుపడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు మర్చిపోలేరన్నారు. లక్ష మెజార్టీతో గెలిపించాలి.. కడియం శ్రీహరి ఈ ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం అరూరి రమేష్‌కు లక్ష ఓట్ల మెజార్టీ అందించాలని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రమేష్ ఎవరో తెలియనినాడు, ఆయన పనితనం తెలియనినాడు 87 వేల ఓట్లతో గెలిపించారని నాలుగున్నర ఏళ్లలో ఆయన చేసిన సేవలు ప్రజలు మరువరని అందుకే రాష్ట్రంలో గత ఎన్నికల్లో నంబర్ టూ మెజార్టీ సాధించిన అరూరికి హరీష్‌కు పోటీగా నంబర్ వన్ మెజార్టీ ఇవ్వాలన్నారు. సస్యశ్యామలం చేయడమే లక్ష్యం : అరూరి రమేష్ నియోజకవర్గంలో తాను నాలుగున్నర ఏళ్లు చేసిన పాలనలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం జరిగిందని రమేష్ అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నేతలు రాజయ్య యాదవ్, ఎల్లావుల లలితా యాదవ్, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, కార్పొరేటర్ చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. v -
ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించాలి..
సాక్షి, ఐనవోలు: మానవీయ కోణంలో పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. మోసం చేయడానికి వస్తున్న మాయా కూటమి కావాలో ప్రజలే నిర్ణయించాలని వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఆయన శుక్రవారం మండలంలోని పంథిని, పెరుమాండ్లగూడెం, కక్కిరాలపల్లి, నందనం, రాంనగర్ గ్రామాల్లో పర్యటించగా మహిళలు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకోవాల్సిన బీజేపీ అభ్యర్థి గ్రామాల్లో తిరుగుతూ కంటికి కనపడిన ప్రతి అభివృద్ధి పని తానే చేశానని గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే.. ‘నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు’ అన్న చందంగా ఉందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థికి కాకుండా పొత్తులో భాగంగా టీజేఎస్ నాయకుడు పగిడిపాటి దేవయ్యకు సీటు కేటాయించిందని, ఆయన ఓట్ల సమయంలో విదేశాల నుంచి డాలర్లు పట్టుకొచ్చి ఇక్కడ ఖర్చు చేసి వెళ్లిపోతాడన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్టు, ఆరోగ్య పరిశుభ్రత కిట్లు, కంటి వెలుగు లాంటి సంక్షేమ పథకాలను, మిషన్ భగీర థ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమా లను అందిస్తోందన్నారు. ‘ప్రజలే దేవుళ్లు, గ్రామాలే దేవాలయాలని నమ్మి సేవచేస్తున్న నేను కావాలో.. గాలిలో తిరిగే, విశ్రాంతి తీసుకోవా ల్సిన నాయకుడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. పెరుమాండ్లగూడెం, కక్కిరాలపల్లిలో పలు పార్టీలకు చెంది న నాయకులు టీఆర్ఎస్లో చేరగా వారికి అరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆరే మా బలం..
గోదావరి జలాలతో ఒక్క వర్ధన్నపేట నియోజకవర్గంలోనే 11 వేల ఎకరాలు తడుస్తోంది. 24 గంటల కరెంటుతో గజం భూమి కూడా ఎంyì పోట్లేదు. రైతు బీమా, రైతు బంధు, సకాలంలో ఎరువులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పింఛన్లు ఇవి చాలవా ప్రజలు తిరిగి మాకు పట్టం కట్టడానికి.. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టింది.. నా నియోజకవర్గం నుంచే ఈ ఏడాది రూ.520 కోట్ల విలువైన ధాన్యం దిగుబడి వచ్చిందని వర్ధన్నపేట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి, తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచార బిజీలో ఉన్న ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. –వర్ధన్నపేట వర్ధన్నపేట నియోజకవర్గంలో దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారు 11 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కాల్వల కింద 38 చెరువులు నింపుతున్నాం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. వీటి ద్వారా సుమారు 5వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఇక ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారు 6వేల సాగు నీరు అందుతుంది. నియోజకవర్గంలో 32 చెరువులు నింపుతున్నారు. హసన్‌పర్తి, హన్మకొండ, వరంగల్, ఐనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని చెరువుల్లో ఎస్సారెస్పీ నీటిని మళ్లిస్తున్నారు. గతంలో వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఎస్సారెస్పీ జలాలు అందలేదు. నాకున్న సమాచారం మేరకు ఈ ఏడాది రూ.520 కోట్ల విలువైన పంట దిగుబడి వచ్చింది. ప్రతి రైతు ఇంట చిరునవ్వులే ఉన్నాయి. డబుల్ బెడ్రూం పథకం పనుల వేగం ఇప్పుడిప్పుడే అందుకుంటోంది. వరంగల్ రెవెన్యూ మండలం ఎస్సార్‌నగర్‌లో సుమారు 800 ఇళ్లు. హసన్çపర్తి మండలం సిద్ధాపురం, అర్వపల్లిల్లో 40 డబుల్‌బెడ్ రూం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. కాట్య్రాలపల్లి 28 డబుల్ బెడ్రూంల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. చింత నెక్కొండ 60డబుల్ బెడ్రూంలు, తుర్కల సోమారంలో 30 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే వ్యక్తిగత ప్లాట్లలో కూడా ఇళ్ల నిర్మాణం చేయడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన వందల కొద్ది సంక్షేమ పథకాలు ఇవాల ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నాయి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌కు నిధులు, బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్‌కు నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కరెంటు చార్జీలు పెంచకుండా చేయడం వంటి సంక్షేమ పథకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల కరెంటు, రూ.లక్ష రుణమాఫి, రూ.వెయ్యి పింఛన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వీర్యమైన యువత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కృషి ఫలితంగా సంపదను సృష్టించగలుగుతోంది. నేను గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రజల మధ్యనే ఉంటున్నాను. వాళ్ల కష్టం, వాళ్ల సుఖం నాది అనుకొని జనంలో తిరుగుతున్నాను. ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు. విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు దృష్టి పెట్టాను. ఈ దఫా విలీన గ్రామాలను అభివృద్ధి చేసి తీరుతా. -
డప్పుకట్టి చిందేసిన ఎమ్మెల్యే
-
MLA అవుతాననుకోలే..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మాది జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు. నాన్న గట్టుమల్లు, అమ్మ వెంకటమ్మ. ముగ్గురు అన్నలు, ఇద్దరు అక్కలు. అన్నలు, ఒక బావ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇంట్లో నేనే చిన్నవాణ్ని. 1967లో పుట్టిన నేను 1995లో పెళ్లి చేసుకున్నా. భార్య క వితాకుమారి. ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు. విశాల్ ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అక్షిత పదో తరగతి చదువుతోంది. ఇదీ సింపుల్‌గా మా కుటుంబం. ఇక చిన్నప్పుడు స్కూల్, కాలేజీ ఎగ్గొట్టి శోభన్‌బాబు సినిమాలు బాగా చూసేవాడిని. ఇప్పుడు వీలుచిక్కినప్పుడల్లా పిల్లలతో కలిసి వెళ్తుంటా. మొన్న 19న సర్వేరోజున ఏషియన్మాల్లో సినిమా చూశా. నా మార్గదర్శి నాన్నే.. అన్ని విషయాల్లో నాన్నే నాకు మార్గదర్శి. దళిత కుటుంబంలో పుట్టినా అప్పట్లోనే ఆరో తరగతి వరకు చదువుకున్నారు. చదువు విలువ బాగా తెలిసిన వ్యక్తి. అప్పటి పంచాయతీ సమితి మొదటి అధ్యక్షుడు మార్నేని కిషన్‌రావు దగ్గర నాన్న పనిచేసేవారు. ఆయన దగ్గరే కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసేవారు. ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సాయంతో బావులు తవ్వించి డీజిల్ ఇంజిన్లు ఇచ్చేవారు. మా బాయిని అప్పటి కలెక్టర్ వచ్చి ప్రారంభించడం నాకు బాగా గుర్తు. అందరూ ఏదో ఒకపనిచేయాలని ఎవరూ ఖాళీగా ఉండకూడదని నాన్న చెప్పేవారు. సెలవుల్లో నన్ను బాయికాడికి తీసుకెళ్లి పనిచేయించేవారు. ఎడ్లుకాసే పని అప్పగించేవారు. ఒకసారి నేను బడికి వెళ్లకుంటే కోదండం ఎక్కించి ఇంట్లోపెట్టి తాళం వేసి వెళ్లిపోయారు. మా పెద్ద వదిన చూసి నన్ను బయటకు తెచ్చింది. చదువు విషయంలో నాన్న అంత కచ్చితంగా ఉండేవారు. అదే ఇప్పుడు నన్నీ స్థితిలో కూర్చోబెట్టింది. కేసీఆర్ అభయమిచ్చారు 2008కి ముందే నేను టీఆర్ఎస్లో చేరాల్సింది. కొన్ని రాజకీయ కారణాలతో ఆలస్యమైంది. సకల జనుల సమ్మెకు ముందు కరీంనగర్లో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరా. ఆ తర్వాత కొద్ది రోజలకే స్టేషన్‌ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజయ్య పార్టీలోకి వచ్చారు. తర్వాత కడియం శ్రీహరి వచ్చారు. కె.విజయరామారావు అప్పటికే సీనియర్ నేత. ఇవేమీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోయా. ఆ పరిస్థితుల్లో మా అధినేత కేసీఆర్ ‘రమేశ్... నువ్వు నేను పెట్టిన మొక్కవు. నీకు ఇబ్బంది ఉండదు’ అని అభయమిచ్చారు. రాజకీయ అవకాశాలపై ఇబ్బంది ఉండదని కేటీఆర్ భరోసా కల్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నిక టి.హరీశ్‌రావుతో సాన్నిహిత్యం పెంచింది. నా పనితీరును ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లా. నియోజకవర్గ ప్రజలు నన్ను అపూర్వంగా ఆశీర్వదించారు. 86,368 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. టీఆర్ఎస్లో చేరిన క్షణం నుంచి కేసీఆర్ నాకు అన్ని రకాలుగా పెద్ద దిక్కులా వ్యవహరించారు. నా మెజారిటీ చూసి అభినందించారు. ఇంటర్‌లోనే టీడీపీలోకి.. ఇంటర్మీడియట్ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఆర్ఎస్యూ కార్యక్రమాలకు వెళ్తున్న కారణంగా పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చింది. అప్పటికే టీడీపీ నాయకుడిగా ఉన్న గట్టు ప్రసాద్‌బాబు, మా మామ కలిసి నన్ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి సేవ్ చేశారు. అప్పుడే ప్రసాద్‌బాబు నాకు టీడీపీ సభ్యత్వం ఇప్పించారు. 1987లోనే తెలుగు యువత జఫర్‌గఢ్ మండల అధ్యక్షుడిగా పనిచేశా. 1994లో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేశా. పూర్తి అంకితభావంతో పార్టీ కోసం పని చేసేవాణ్ని. అప్పట్లో ఏ ఎన్నికలు వచ్చినా మా మండలంలో టీడీపీ గెలిచేది. 1994 ఎన్నికల్లో కడియం శ్రీహరి మా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 2001లో టీఆర్ఎస్ హవా ఉంది. అప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేయాలని కడియం శ్రీహరి నాపై ఒత్తిడి తెచ్చారు. నాకు ఆసక్తి లేక మరొకరిని నిలబెట్టి గెలిపించుకున్నాం. 2008లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. టీడీపీ అభ్యర్థి అరూరి రమేశ్ అని ఒక టీవీ చానల్లో స్క్రోలింగ్ వచ్చింది. నాకు అప్పటికి అటువంటి ఉద్దేశం లేదు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని అనుకునేవాణ్ని. ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నించా. టీడీపీ తరపున కడియం శ్రీహరి గెలిచారు. ఆ తర్వాత వివిధ కారణాలతో పార్టీకి దూరమయ్యా. 2009 ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశా. అయితే ఎమ్మెల్యేనవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అదే.. టర్నింగ్ పాయింట్ మా మేనమామ కొమురుమల్లు చిన్నపెండ్యాలలో ఉండేవారు. హరిజన లేబర్ కాంట్రాక్టు సొసైటీ పేరుతో అప్పట్లోనే చిన్నచిన్న కాంట్రాక్టులు చేసేవారు. నాకున్న భావజాలం వల్ల అప్పట్లో కాంట్రాక్టర్లు అంటే నాకు వ్యతిరేకత ఉండేది. ఏదైనా కాంట్రాక్టు, టెండరు పనుల కోసం వెళ్లేటప్పుడు మా మేనమామ రమ్మని పిలిస్తే వెళ్లేవాణ్ని కాదు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పడు మా మేనమామ చనిపోయారు. వాళ్ల పిల్లలు చిన్నవాళ్లు. మేనమామ చనిపోయే నాటికి ఆయనకు ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బిల్లులు ఉన్నాయి. మరికొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో బిల్లుల కోసం బాగా తిరిగాను. అసంపూర్తి పనులు పూర్తి చేయించాను. కాంట్రాక్టరు వ్యవస్థ గురించి బాగా తెలిసింది. అలా డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే అనివార్యంగా కాంట్రాక్టరుగా మారాను. సొంతంగా మొదట రూ.40 వేలతో మా ఊరు చెరువు తాత్కాలిక మరమ్మతు పనులు చేశాను. నాన్న, ఊళ్లోని మిత్రులు సహకరించారు. తర్వాత రూ.2 లక్షలతో మా చెరువు శాశ్వత పనులు చేశా. రూ.5 లక్షలతో జఫర్‌గఢ్‌లో చెక్‌డ్యాం... ఇలా మొల్లమెల్లగా కొనసాగింది. ఏ పనిచేసినా ఉన్నతంగా ఉండాలని నాన్న చెప్పేవారు. దీంతో ఈ వృత్తిలోనే స్థిరపడి క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అనిపించుకోవాలనుకున్నా. కాంట్రాక్టులు చేస్తూనే పీజీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. నిజానికి టీచింగ్ ఫీల్డే నా లక్ష్యం పీహెచ్డీ పూర్తిచేసిన తర్వాత టీచింగ్ ఫీల్డ్‌లో సెటిల్ కావాలనుకునేవాణ్ని. మా ఊర్లోనే ఏడో తరగతి వరకు చదువుకున్నా. ఎనిమిది నుంచి పది వరకు కూనూరులో చదివా. అప్పట్లో జఫర్‌గఢ్‌లో ఆర్ఎస్యూ కార్యక్రమాలు బాగా ఉండేవి. అప్పుడప్పుడు ఆ కార్యక్రమాలకు వెళ్లేవాణ్ని. ఈ విషయంలో నాన్న ఎంతో ఆందోళన చెందేవారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బీఏ, కేయూలో ఎంఏ సోషియాలజీ పూర్తిచేశా. డిగ్రీ, పీజీ ఫస్ట్ క్లాస్‌లో పా సయ్యా. ఆ తర్వాత ఆదర్శ లా కాలేజీలో చేరినా పూర్తిచేయలేకపోయా.