ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న అరూరి రమేష్
సాక్షి, ఐనవోలు: మానవీయ కోణంలో పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలో.. మోసం చేయడానికి వస్తున్న మాయా కూటమి కావాలో ప్రజలే నిర్ణయించాలని వర్ధన్నపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఆయన శుక్రవారం మండలంలోని పంథిని, పెరుమాండ్లగూడెం, కక్కిరాలపల్లి, నందనం, రాంనగర్ గ్రామాల్లో పర్యటించగా మహిళలు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకోవాల్సిన బీజేపీ అభ్యర్థి గ్రామాల్లో తిరుగుతూ కంటికి కనపడిన ప్రతి అభివృద్ధి పని తానే చేశానని గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే.. ‘నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు’ అన్న చందంగా ఉందన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థికి కాకుండా పొత్తులో భాగంగా టీజేఎస్ నాయకుడు పగిడిపాటి దేవయ్యకు సీటు కేటాయించిందని, ఆయన ఓట్ల సమయంలో విదేశాల నుంచి డాలర్లు పట్టుకొచ్చి ఇక్కడ ఖర్చు చేసి వెళ్లిపోతాడన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్టు, ఆరోగ్య పరిశుభ్రత కిట్లు, కంటి వెలుగు లాంటి సంక్షేమ పథకాలను, మిషన్ భగీర థ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమా లను అందిస్తోందన్నారు. ‘ప్రజలే దేవుళ్లు, గ్రామాలే దేవాలయాలని నమ్మి సేవచేస్తున్న నేను కావాలో.. గాలిలో తిరిగే, విశ్రాంతి తీసుకోవా ల్సిన నాయకుడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. పెరుమాండ్లగూడెం, కక్కిరాలపల్లిలో పలు పార్టీలకు చెంది న నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి అరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment