తప్పు నాది కాదు తుమ్మలదే: కేసీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ లోకి చేరిన తుమ్మల నాగేశ్వరరావుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. తుమ్మల చేరిక సందర్భంగా ఓ వెయిమంది వస్తారని అనుకున్నా.. కాని భారీ సంఖ్యలో వచ్చారని.. ముందే తెలిస్తే నిజాం కాలేజిలో సభను నిర్వహించడానికి ప్రయత్నం చేనేవాళ్లమని.. అయితే ఈ విషయంలో తప్పు నాది కాదు తుమ్మలదేనని కేసీఆర్ అన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు నిప్పులాంటి వారని, మంచి నేత అని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ సంధి సమయంలో ఉందని, శతాబ్దకాలంగా పోరాటం చేస్తొందని ఆయన తెలిపరాఉ. తెలంగాణ ప్రాంతవాసులు అనేక బాధలు, ఒత్తిల్లు, బలిదానాలు చేశారని కేసీఆర్ అన్నారు.