కేసీఆర్ 70 వేల పుస్తకాలు చదివారు..
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్
వరంగల్ : తెలంగాణసీఎం కేసీఆర్ 70 వేల పుస్తకాలు చదివారని, పుస్తకాలలో నేర్చుకున్న విజ్ఞానంతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సీకేఎం) వార్షికోత్పవం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ మాట్లాడుతూ పుస్తకాల ద్వారా విజ్ఞానం నేర్చుకోవచ్చన్నారు. దేశంలో విద్య కమ్యూనికేషన్ ద్వారా సాగుతోందన్నారు.kcr
అందరు వదిలేసినా... తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమించిన ఏకైక వ్యక్తి తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి అని అన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేంద్ర శాస్త్రి పాల్గొన్నారు.