సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రుల బృందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై మంత్రులకు అవగాహన కల్పించాల ని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం మంత్రులంతా అందుబాటులో ఉండాలని సీఎం కార్యాలయం నుంచి సమాచారం పంపించినట్లు తెలిసింది. అవగాహనలో భాగంగా.. సిద్దిపేటలోని మంచినీటి ప్రాజెక్టును మంత్రులకు చూపించాలని సీఎం భావిస్తున్నారు. సుమారు 200 గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తున్న సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టును 2000 సంవత్సరంలో మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే.
రేపు వాటర్‌గ్రిడ్‌పై మంత్రులకు అవగాహన
Published Tue, Dec 9 2014 6:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement
Advertisement