సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమ రాజకీయ చైతన్యానికి పుట్టిళ్లు. ప్రస్తుతం తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, మెదక్ జిల్లా నేతలే ‘ముఖ్య’మైన పదవిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అధికారంలోకి రావడాని అవకాశం ఉన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎరికి ఎన్ని సీట్లు వస్తాయంటూ లెక్కలు గడుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ యమ ఫాస్టుగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఒక్క అడుగు వేసే లోపు... కేసీఆర్ పది అడుగులు వేస్తున్నారు. గెలుపోటములపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ఎవరికివారు లెక్కలు వేసుకుంటుంటే, గులాబి బాస్ కేసీఆర్ ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుపైనే కసరత్తు చేస్తున్నారు.
ఎలా చేద్దాం..ఎవరికి అవకాశమిద్దాం
జూన్ 2వ తేదీన ఉనికిలోకి రానున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లిలో గల తన ఫాంహౌస్‌లో కేసీఆర్ కుస్తీ పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి...వాటికి నిధులు ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశాలున్నాయి...మంత్రి వర్గంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టీఆర్‌ఎస్‌కు 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాలు రావచ్చని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్లు రాల్చిన కీలక హామీలైన ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు, గృహనిర్మాణం అమలుపై నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు మంత్రివర్గ ఏర్పాటుపై కూడా కేసీఆర్ సీరియస్‌గానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మెదక్ జిల్లా నుంచి కనీసం ఇద్దరికి చోటు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్‌రావుకు దాదాపు బెర్తు ఖయమైనట్లు సమాచారం. ఆయనకు నీటి పారుదల, లేదా రెవిన్యూ శాఖ అప్పగించే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రెవిన్యూ శాఖపై ఆసక్తి చూపుతున్న హరీష్‌రావు, ఏదైనా మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇక చివరివరకు టికెట్ కోసం పోరాడి సీటు కొట్టేసిన దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు, జర్నలిస్టుల్లో ఉద్యోగ సంఘాల నుంచి ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు, జర్నలిస్టుల విభాగం నుంచి సోలిపేటకు అవకాశం ఇస్తే ఇరు వర్గాలను సంతృప్తి పరిచినట్లు ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫాం హౌస్‌లో కుస్తీ
Published Mon, May 5 2014 11:31 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement