హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేపు(శుక్రవారం) పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి పరిధిలో 3,300, ఖైరతాబాద్ పరిధిలోని ఎన్ బీటీ కాలనీలో 7 వేల కుటుంబాలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయనున్నారు. క్రమబద్ధీకరణలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యం..!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా నగర పరిధిలో కనీసం లక్షమంది పేదలకైనా పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లకు లక్ష్యా లు విధించినట్లు సమాచారం.
రేపు 'గ్రేటర్'లో ఇళ్ల పట్టాల పంపిణీ
Published Thu, Jun 4 2015 5:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement