మోమిన్‌పేట పీఎస్‌లో నూతన గదులను ప్రారంభిస్తున్న ఎస్పీ అన్నపూర్ణ
మోమిన్‌పేట : పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత పాటించాలని ఎస్పీ అన్నపూర్ణ సిబ్బందికి సూచించారు. పీఎస్‌ల వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ శిరీషతో కలిసి సోమవారం ఆమె మోమిన్‌పేట స్టేషన్‌ను సందర్శించారు. పీఎస్‌లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో కలియతిరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని.. సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ను అభినందించారు.
స్మార్ట్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల్లో పోలీసులంటే భయం పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతీ స్టేషన్‌కు రిసెప్షనిస్ట్‌తో పాటు ఫిర్యాదుదారులకు అవసరమైన కాగితం, పెన్నుతో పాటు టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తాగేందుకు చల్లని నీరు, చెట్ల కింద కూర్చునేందుకు బల్లలు వేశామన్నారు.
రికార్టులను ఫైలింగ్ చేయడంతో పాటు సిబ్బందికి అవసరమైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని 14 పీస్‌లను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. గతంలో కన్నా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. ప్రతీ రోజు వాహనాల తనిఖీలు, డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామన్నారు.
లైసెన్స్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రమా దాలు బాగా తగ్గాయన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలతో పాటు భరోసా కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment