సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ధాన్యం సేకరణకు యాక్షన్‌ప్లాన్ విడుదలైంది. ఇందుకోసం జిల్లాలో 290 కేం ద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్ర భుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు మార్గదర్శకాలను నిర్దేశించారు. డీఆర్‌డీఏ ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ ఏడాది రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధా న్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు.
36 మండలాలలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో 280 కేంద్రాల ద్వారా 1,39,500 మెట్రి క్ టన్నులు కొనుగోలు చేయగా, ఈసా రి పెరిగిన ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అవసరాల దృష్ట్యా మరో పది కేంద్రాలను అదనంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 6 వరకు దశల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేసి, దసరా తర్వాత కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈసారీ సీఎంపీనే
2014-15 ఖరీఫ్ యాక్షన్‌ప్లాన్ ప్రకారం జిల్లాలో ఈ సీజన్‌లో 3,20,761 లక్షల హెక్టార్లకు గాను 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.33 లక్షల హెక్టార్లలో సోయా, 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 13,500 హెక్టార్లలో పత్తి, 13,500 హెక్టార్లలో పసుపు సాగవుతుందని అంచనా వేయగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 2,12,680 హెక్టార్ల లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 86,881 హెకార్లలో రైతులు వరిని సాగు చేశారు.
గతేడాదితో పోలిస్తే 19 వేల హెక్టార్లలో వరి సాగు తగ్గింది. ఈ నేపథ్యం లో రైతులు, పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఈసారి పౌరసరఫరాల శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ ద్వారా 50 కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా 240 కేంద్రాలను నిర్వహించనున్నారు. వీటి పర్యవేక్షణకు డిప్యూటీ తహశీల్‌దార్లను సూపర్‌వైజర్లుగా నియమించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసేందుకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఉన్న సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు, కొన్ని రైసుమిల్లులను ఎంపిక చేశారు. ఆ తరువాత ధాన్యాన్ని వీలైనంత మేరకు ఈసారి కూడ కస్టమ్ మిల్లిం గ్ కోసం రైసుమిల్లర్లకు అప్పగించనున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర
రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు శిక్ష ణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న క్రమంలో తేమ లేకుండా ధాన్యం మార్కెట్‌కు తర లించేలా చూడాలని ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు.
మహిళా సంఘాలకు గతం (2010-11)లో ధాన్యం కొనుగోలుపై రూ.100లకు రూ.1.50లు కమీషన్ చెల్లించిన ప్రభుత్వం 2011-12లో రూ.2.50లకు పెంచింది. ఈసారి ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని గ్రేడ్-ఎ రకం ధాన్యం క్వింటాలుకు రూ.1,400, కామన్‌కు రూ. 1,365 చెల్లించి కొనుగోళ్లు జరపాల్సి ఉంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి కొనుగోళ్లు జరిగేలా చూడాలని రైతులు అంటున్నారు.
ధాన్యంలో తేమ 14 శాతం దాటితే కొనుగోలు చేయకూడదన్న నిబంధనలతో పాటు గ్రేడ్-ఎ, కామన్ రకాల ధాన్యంలో రా రైసుమిల్లుకు విరుగుడు 25 శాతం, బాయిల్డ్‌కైతే 16 మించకుండా చూడాలన్న నిబంధన కూడ ఉంది. అయితే నిబంధనల పేరిట రైతులకు కనీస మద్దతు ధరకు ప్రతిబంధకాలు కలగకుండా చూడాలని అధికారులను రైతులు కోరుతున్నారు.
ఇక ఖరీఫ్ కొనుగోళ్లు
Published Fri, Sep 26 2014 3:00 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement