కిషన్‌రెడ్డి అరెస్ట్
ఖమ్మం: నగరంలోని మిర్చి మార్కెట్‌కు ర్యాలీగా వెళ్తున్న బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రే నగరానికి చేరుకున్న ఆయన స్థానిక హోటల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయాన్నే ర్యాలీ ప్రారంభించడంతో పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున కిషన్‌రెడ్డిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గణేష్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని కిషన్ రెడ్డి అన్నారు.