హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి భావ దారిద్ర్యం ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి భావదారిద్రం ఉందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఎక్కడా చూసినా రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేర్లు పెట్టారన్నారు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ పేరు మార్చే విషయంలో ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడనని.. అసలు ఈ అంశం కేబినెట్ లో చర్చకు రాలేదని వారు తెలిపినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ అంశం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో ఉందా?లేదా? అనేది తనకు తెలియదన్నారు. దేశంలో 1500 పథకాలకు ఒకే కుటుంబం పేర్లు ఉన్నాయన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పెట్టుకుంటే బాగుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. మరో టెర్మినల్ కు కొమరం భీం పేరు పెట్టుకుందామన్నారు.