
రాజీనామా చేయాలనుకున్నా: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై అలకబూనారు. శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోడంతో ఆయన నొచ్చుకున్నారు. సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు నచ్చచెప్పడంతో ఆయన సభలోకి వచ్చారు. కీలకమైన విషయం గురించి ప్రస్తావించేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంతో డిప్యూటీ స్పీకర్ మీద అలిగానని వెంకట్రెడ్డి తెలిపారు. రేపు రాజీనామా చేయాలనుకున్నట్టు వెల్లడించారు.
సభ మీద అలగాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు. సీనియర్ సభ్యుడైన వెంకట్రెడ్డి అంటే తమకెంతో గౌరవం ఉందని చెప్పారు. ఆయన తమ దృష్టికి అంశాలపై వెంటనే స్పందిచినట్టు కేసీఆర్ వెల్లడించారు.