మాటల తూటాలు పేల్చగలరు. మనిషి చూడటానికి సున్నితంగా ఉన్నా, ప్రజల అన్యాయాలను ఎదురించడానికి ఎంత కష్టమైనా ఎదురించగల నారి. తన భర్త వలనే రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాణిరుద్రమదేవిని ఓరుగల్లులో తెలియనివారు ఎలా ఉండరో అలాగే కొండా సురేఖ పేరు కూడా తెలియనివారుండరు. ప్రత్యర్ధుల విమర్శలకు , ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పగల ధీర వనిత. మహిళగా రాజకీయాల్లో రాణించినప్పటికీ సాగిన ప్రయాణంలో అనేక ఆటుపోటులు తప్పలేదు. ఆడపడుచులుగా అండదండగా కొండా కుటుంబం ఎప్పుడూ ఉంటుందని అందులో తనదైన ముద్ర వేసుకోగలిగారు. చిన్నప్పటి నుంచి ఆటలలో, చదువులో నంబర్ వన్‌గా ఉంటూ కాలేజీలో తన సీనియర్ కొండా మురళిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. భర్తకి తోడుగా ఉంటూ ఒక మంచి గృహిణిగా పేరు తెచ్చుకున్నారు. కొండా దంపతులు అంటే వరంగల్ సూపర్ స్పెషల్ జోడి అని అంటుంటారు. తన లాగే తన కూతురిని పెంచారు. తన తర్వాత తన కూతురిని రాజకీయ వారసురాలుగా ప్రకటించారు.
నేపథ్యం :
తల్లిదండ్రులు : తుమ్మ చంద్రమౌళి, తుమ్మ రాద
పుట్టిన తేదీ : 19 ఆగస్టు 1965
జన్మస్థలం : వరంగల్ జిల్లా ఊకల్ గ్రామం
కుటుంబం : తండ్రి ప్రభుత్వ ఉద్యోగి
వైవాహిక జీవితం : ఎమ్మెల్సీ కొండా మురళితో ప్రేమవివాహం. వీరికి ఒక కుమార్తె శ్రీమతి సుస్మిత పటేల్.
చదువు : ఎల్పీ కాలేజీ నుంచి బీఏ డిగ్రీ
వృత్తి : శాసనసభ్యురాలు, పరకాల అసెంబ్లీ నియోజకవర్గం.
నివాసము : వంచనగిరి
రాజకీయ జీవితం :
►1955లో మండల పరిషత్ కు ఎన్నికయ్యారు
►1996లో ఆమె ఆంధ్రప్రదేశ్ పి.సి.సి సభ్యురాలిగా నియమింపబడ్డారు
► 1999 లో ఆమె శాయంపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు
►1999 లో ఆమె కాంగ్రెస్ లెసిస్లేచర్ పార్టీ కోశాధికారిగానూ మహిళ మరియు శిశు సంక్షేమశాఖ సభ్యురాలిగా, ఆరోగ్య మరియు ప్రాథమిక విద్య కమిటీ సభ్యురాలిగా పనిచేశారు
► 2000లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా నియమింపబడ్డారు.
► 2004లో శాయంపేట శాసనసభ్యురాలిగా ఎన్నిక
► కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
► 2005లో ఆమె మ్యునిసిపల్ కార్పొరేషన్ కు ఎక్స్ అఫీసియో సభ్యురాలిగా
► 2009 లో పరకాల శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యురాలిగా
► జూలై 4, 2011 న తన శాసనసభ్యత్వానికి రాజీనామా
► జూన్ 12,2012 న జరిగిన ఉప ఎన్నికలలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీ
► జూలై 2013 న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
► టీఆర్ఎస్ లో చేరిక, వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా ఎన్నిక
► తిరిగి కాంగ్రెస్‌లో చేరిక - ప్రస్తుత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో....
- కొండి దీపిక
Comments
Please login to add a commentAdd a comment