
సాక్షి, హైదరాబాద్ : వర్షాల ఆరంభానికి ముందే నెలాఖరులోగా జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం జూన్ 6వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే నిర్ణయించిన ఎజెండా అంశాలపై సమావేశంలోనే చర్చిద్దామంటూ బోర్డు కార్యదర్శి పరమేశం శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. నిజానికి ఈనెల 28న బోర్డు సమావేశం నిర్వహించాలని తెలంగాణ కోరగా, ఏపీ అభ్యంతరం తెలుపుతూ, జూన్ 1న సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాల నేపథ్యంలో తమకు వీలుపడదని తెలంగాణ స్పష్టం చేయడంతో బోర్డు సమావేశ తేదీని 6న ఖరారు చేసింది.