తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారవు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వల్ల కాదనే ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని, కాంగ్రెస్ వాళ్లకు బుద్ది వస్తే మంచిది.. రాకపోతే ఇంకా మంచిదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారవు అన్నారు. మంగళవారం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు చేపట్టిన ప్రాజెక్ట్‌ల పనులను చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ నేలను సస్యశ్యామలం చేయటం కోసం వేగంగా ప్రాజెక్టు పనులను చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు ఏమైతదో దేశమంతా అదే చేస్తరు అనే విధంగా ఉందన్నారు. యాబై ఏళ్ల దరిద్రం నాలుగేళ్లలో పోవటం సాద్యం కాదని, దానికి కొంచెం టైం పడుతుందని అన్నారు.
కేటీఆర్ సుడిగాలి పర్యటన
హైదరాబాద్ : రాజేంద్రనగర్ నియోజక వర్గంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, సబ్ స్టేషన్లు, కిస్మత్‌పూర్‌లో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ సీ.నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment