
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ సంస్థ ఐదేళ్లలో గణనీయంగా వృద్ధి సాధించడంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అభినందనలు తెలిపారు. ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో గడిచిన ఐదేళ్లలో సింగరేణి సంస్థ గణనీయమైన వృద్ధి సాధించింది. అమ్మకాలలో 117 శాతం వృద్ధి నమోదైంది. రూ.11,928 కోట్ల నుంచి రూ.25,828 కోట్లకు చేరింది. 282 శాతం లాభదాయకవృద్ధి (ప్రాఫిట్ గ్రోత్) నమోదైంది. రూ.419 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు పెరిగింది. సింగరేణి సీఎండీకి, సింగరేణి ఉద్యోగులకు అభినందనలు’అని కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment