పల్లెపల్లెకూ తాగునీరు.. ఇంటింటికీ నల్లా: కేటీఆర్
గంభీరావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని పల్లె పల్లెకూ తాగునీరు, ఇంటింటికీ నల్లా నీరిస్తామని, ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలోని వెంకటాద్రి చెరువులో గురువారం మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు. ఓట్ల కోసమో, ఎన్నికల సమయంలోనో సీఎం ఈ మాట చెప్పలేదని, అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలేనని అన్నారు.
5 నుంచి కేటీఆర్ అమెరికా పర్యటన
మంత్రి కేటీఆర్ ఈ నెల 5 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ప్రవాస భారతీయుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రెండు వారాల పాటు ఈ పర్యటన సాగనుంది. ఆయన పర్యటనలో అమెరికాలో భారత రాయబారి అరుణ్ కె.సింగ్‌తో ప్రత్యేక విందులో పాల్గొననున్నారు. మంత్రితో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా వెళ్లనున్నారు.