
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం అందింది. ప్రాంతీయ పార్టీల నేతలందరినీ తాను ఆహ్వానిస్తున్నానని, అందులో భాగంగా పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించినట్టు కుమారస్వామి తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కొద్దిరోజుల క్రితం కేసీఆర్ మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, కుమారస్వామితో బెంగళూరులో భేటీ అయిన విషయం తెలిసిందే.
కేటీఆర్ హాజరయ్యే అవకాశం
కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్– జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి వెళ్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు బదులుగా కేటీఆర్‌ను పంపించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment