అవతలివారితో తప్ప ఆయనలో కన్ఫూజన్ ఉండదు. చెప్పాల్సింది విడమరిచి చెప్పేస్తారు. అజానుబాహుడు. ఆజాతశత్రువు... రాజకీయాల్లో పెద్దాయన. ఆయన వద్ద కంటెంట్‌కు కొదవలేదు. ఎదైన విషయం చెప్పల్సివచ్చినా, వ్యవహారం తేల్చుకోలేకపోయినా పార్టీ ఆయనకే మైక్ ఇస్తుంది. అటూ, ఇటూ తేల్చకుండా వెరైటిగా చెప్పడంలో ఆయన ఎక్స్‌పర్ట్. అర్థం చేసుకోవాలంటే తల కిందులుగా తపస్సు చేయాల్సిందేనని మీడియా ప్రతినిధులు చెబుతుంటారు. అదే విషయాన్ని ఆయన్ని అడిగితే అందులో కన్ఫూజన్ ఏమీ లేదంటూ మళ్లీ చెబుతారు. నిండుకుండలా తొణక్కుండా ఉండటం ఆయనకే సాధ్యం. ఉద్యమ సమయంలో ఆయన వైఖరే కాస్తో, కూస్తో కాంగ్రెస్‌కి కలిసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డ్ ఆయన సొంతం.
వైరం లేకుండా ఉండి, లౌక్యంగా వ్యవహారం నడిపే జానారెడ్డికి పోటీ లేదు.నల్గొండలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు. పార్టీ వారితోనే కాదు... పౌరహాక్కుల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. జేఏసీ ఏర్పాటులో కీలకపాత్ర, ఇప్పటికీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయ్యాడు. ఒక్క1994లో తప్ప వరుసగా ఎమ్యెల్యేగా గెలిచిన రికార్డు ఆయనది. చలకుర్తి నియోజకవర్గం ఆయన కంచుకోట. కమ్యూనిస్టు కోటలో కాంగ్రెస్ నేతగా ఎదిగారు. దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి రికార్డునూ బ్రెక్ చేశారు. వైఎస్ హాయంలో హోం శాఖలను నిర్వహించారు. తెలంగాణలో కీలక నేతగా ఎదిగిన జానారెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా జానారెడ్డి ఏ మాత్రం తన ప్రాభవాన్ని ప్రభావాన్ని కోల్పోలేదు.
పూర్తి పేరు : కుందూరు జానా రెడ్డి
తండ్రి : కే. వీరా రెడ్డి
పుట్టిన తేది : 20 జూన్ 1946
స్వగ్రామం : అనుముల గ్రామం, (చలకుర్తి) నాగార్జున్ సాగర్, నల్గొండ
కుటుంబం : భార్య సుమతీ
సంతానం : రఘవీర్ రెడ్డి, జయ వీర్ రెడ్డి
చదువు : హెచ్ ఎస్సీ
అలవాట్లు : పున్తకాలు చదవటం
నేపథ్యం :
ఉపాధ్యయుడిగా మొదలు పెట్టిన ప్రస్థానం, ఎక్కువ కాలం మంత్రిగా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకున్నారు.1973లో మొదలైన రాజకీయ ప్రస్థానం, మఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మినహా అన్ని పదవులు చేపట్టారు.
►1983 లో తొలిసారి ఇండిపెండెంట్‌గా గెలిచారు
►1985 లొ చలకుర్తి నియోజకవర్గం టీడీపీ తరపున గెలిచారు
► 1988 లో మంత్రివర్గం రద్దుతో ఎన్టీఆర్‌తో విభేదించి 'తెలుగు మహానాడు'పేరుతో పార్టీని స్థాపించాడు.తరువాత రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో విలీనం చెశారు.
► 1994 లో తప్ప వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు
► 2004 లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు
► 2009-2014 వరకు పంచాయితీ గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు
- జీ. రేణుక
Comments
Please login to add a commentAdd a comment