పెద్ద ఆసామి కుటుంబంలో పుట్టినా పేద, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా. వెనుకబడిన తరగతుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న నాయకుడు. తండ్రి నుంచి దానగుణం, పోరాట భావజాలం, తల్లి నుంచి మొక్కవోని ధైర్యం, సేవాగుణాన్ని ఆర్జించిన వ్యక్తి. బీసీ హక్కులు సాధన కోసం సుమారు ఎనిమిది వేలకు పైగా ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించిన ఉద్యమనాయకుడు. నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకుడే ర్యాగ కృష్ణయ్య .ఎమ్మెల్యే అయినా ఇప్పటికీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షుడు పనిచేయడమే ఆయనకు ఇష్టం. చాలా మంది ఆయనను బీసీ కృష్ణయ్య అని కూడా పిలుస్తుంటారు. ఎన్నో ఉద్యమాలు చేసినా ఒక్క అవాంచనీయ సంఘటన కూడా జరగకుండా చూసిన ఉద్యమ నాయకుడు. ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.
'అవమానాలను మానంగా మర్చుకున్నా, అపజయాలను జయాలుగా మార్చుకున్నా, విజయాలనే లక్ష్యంగా మార్చుకున్న విజయ సాధకుడిని నేను' అని అంటారాయన. అందుకే ఉద్యమాలు చేసే యువతకు మార్గనిర్దేశకుడు. తన విజయాలను చూసి గర్వపడుతున్నానని చెప్పుకుంటారు. చిన్న చిన్న ఉద్యమనాయకులకు స్పూర్తినిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్టీరామారావు పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిగెలుపొందాక మంత్రి పదవి ఇస్తామని చెప్పినా తన ఆశయం కోసం ఆ ప్రతిపాదనను వదులుకున్నారు. అందరి ముఖ్యమంత్రుల మన్ననలు పొందారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇష్టమైన ఉద్యమ నాయకుల్లో కృష్ణయ్య ఒకరు. 'వ్యక్తిగతమైన అంశాలకి ప్రాధాన్యత ఇవ్వరు' అని దివంగతనేత ప్రశంసలను అందుకున్నారు. రాజకీయ నాయకుడిని కాదు ఉద్యమ నేతను అని ఇప్పటికీ చెప్పుకునే వ్యక్తి. తను టీడీపీలో ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ ఆ పార్టీకి ఎదురొడ్డిన నాయకుడు. బీసీలకు 50 శాతం రాజ్యాదికారం దక్కడమే తన లక్ష్యంగా ప్రకటించుకున్నారు.
ఉద్యమ జీవితం :
► 1972 లో బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ విద్యార్ధి యూనియన్ సంఘానికి అద్యక్షుడు
► 1973 లో డిగ్రీ చదివే రోజుల్లో ఉస్మానియా విద్యార్ధి సంఘం నాయకుడిగా పనిచేశారు
► 1977 -1987 వరకు రాప్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్ధుల హక్కుల సంఘానికి అద్యక్షుడు
► 1980 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో రిజర్వేషన్లు కోసం పోరాటం
► 1996 మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం పోరాటం
► 1989 నుంచి 1993 వరకు సర్పంచ్ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం... ఫలితంగా బీసీలకు రిజర్వేషన్ల సౌకర్యం
► 1990 లో మండల కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలో ఆందోళనలు
ఉద్యమ ఫలితాలు :
► కృష్ణయ్య పోరాట ఫలితంగా వెనుకబడిన తరగతులు, తెగల సంక్షేమానికి సంబంధించి దాదాపు రెండు వేలకుపైగా జీవోలు జారీ
► ప్రభుత్వాలు అనేక సంక్షేమ భవనాల నిర్మాణాలు... రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేలకు పైగా బీసీ వసతి గృహాలు ఏర్పాటు
► సర్పంచ్‌ల చెక్ పవర్ కోసం పోరాటం
► సుదీర్ఘ పోరాట ఫలితంగానే పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అమలు
నేపథ్యం :
పుట్టిన తేది : 13 సెప్టెంబర్ 1954
జన్మస్థలం : రంగారెడ్డి జిల్లాలోని రాళ్లగడుపల్లి
తల్లిదండ్రులు : అడివప్ప, రాములమ్మ (పుట్టిన 12 ఏళ్లకే తల్లి చనిపోయింది)
కుటుంబం : భార్య శభరీదేవి, కుమారుడు రుషి అరుణ్ (ఎంబీబీఎస్), కుమార్తె రాణి శ్వేతాదేవి (ఎంటెక్)
విద్యార్హతలు : బీకాం., ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంఫిల్ (ఉస్మానియా యూనివర్సిటీ)
పత్రికలు : బీసీ గర్జన పత్రికకు సంపాదకులుగా పనిచేశారు
ప్రస్తుతం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగుల సంఘర్షన సంఘానికి అద్యక్షుడు
రాజకీయ నేపధ్యం : 2014 లో ఎల్‌బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
► ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీలో ఉన్నారు
- అఖిల్ (ఎస్ ఎస్ జే)
Comments
Please login to add a commentAdd a comment