నిజామాబాద్ అర్బన్: భీమ్‌గల్ మండలం కారేపల్లి గ్రామానికి చెందిన తిరుపతి నాయక్ జిల్లా ప్రభుత్వ ఆస్పతిలో కరోనా ఐసోలేషన్ వార్డులో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇదే ఆస్పత్రిలో 13 రోజుల క్రితం ఇతని భార్య ప్రసవించగా మగ బిడ్డ పుట్టాడు. ఒకే ఆస్పత్రిలో తన భార్య, పుట్టిన బిడ్డ ఉన్నప్పటికీ కనీసం కళ్లారా చూసుకునే పరిస్థితి లేదు. ఐసోలేషన్ వార్డులోనే తిరుపతి విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా భయానికి బిడ్డ వద్దకు గానీ, ఇంటికి గాని వెళ్లడం లేదు.(కరోనా: ఏపీలో మరో 31.. మొత్తం 603)
Comments
Please login to add a commentAdd a comment