ప్ర‌స‌వం త‌ర్వాత‌ ప‌దిహేను రోజులుగా చెట్టు కిందే.. | Family Struck At Nizamabad Hospital Amid Lockdown | Sakshi
Sakshi News home page

స్వ‌స్థ‌లానికి పంపించండి: కుటుంబం ఆవేద‌న‌

Published Fri, Apr 10 2020 9:11 PM | Last Updated on Fri, Apr 10 2020 9:19 PM

Family Struck At Nizamabad Hospital Amid Lockdown - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ ఎంద‌రో సామాన్యుల‌ను ఇబ్బందికి గురి చేస్తోంది. ఎక్క‌డి వాళ్ల‌క్క‌డే అంటూ ఒక్కసారిగా ఆదేశాలివ్వ‌డంతో చాలామంది త‌మ స్వ‌స్థ‌లాల ద‌గ్గ‌ర కాకుండా ఇత‌ర ప్ర‌దేశాల్లో ఇరుక్కుపోయారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ ప‌దిహేను రోజుల క్రితం నిజామాబాద్ ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలో డెలివ‌రీ అయ్యింది. అయితే స్వ‌స్థ‌లానికి వెళ్లేందుకు బ‌స్సులు లేక‌పోవ‌డంతో న‌గ‌రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోని చెట్టు కింద ఆ మ‌హిళ కుటుంబం ఆశ్ర‌యం పొందుతోంది. తిరిగి ఇంటికి వెళ్ల‌డానికి అంబులెన్స్ కూడా రాలేద‌ని ఆ కుటుంబం తెలిపింది. త‌మ‌ను ఎలాగైనా స్వ‌గ్రామానికి పంపించాల‌ని కోరుతోంది. (శనివారం తెలంగాణ కేబినెట్‌ సమావేశం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement