హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో పనుల్లో పాల్గొంటున్న ఓ కూలీ దగ్గర తుపాకీ బయటపడడం శుక్రవారం సంచలనం సృష్టించింది. జార్ఖండ్ చెందిన ఆ కూలీని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన మహ్మద్ ఇఫ్తెకార్ అన్సారీ గతంలో టైలర్‌గా పనిచేసేవాడు. అయితే హైదరాబాద్ వచ్చి కూకట్‌పల్లిలోని ఎల్‌అండ్‌టీ మెట్రో క్యాంప్‌లో సోదరుడు మహ్మద్ శంషద్ అన్సారీతో కలిసి కూలీగా పనిచేస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఎల్‌అండ్‌టీలోనే కూలీగా పనిచేసే బీహార్‌కు చెందిన దీపక్ (27) అనే వ్యక్తి వద్ద రూ.5వేలకు దేశవాళీ తుపాకీని కొనుగోలు చేశాడు. దీనిని ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని అన్సారీ ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
'మెట్రో' కూలీ వద్ద తుపాకీ
Published Fri, Apr 3 2015 7:47 PM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM
Advertisement
Advertisement