హమాలీ కార్మికుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఓ లేబర్ ఆఫీసర్.
కరీంనగర్ : హమాలీ కార్మికుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఓ లేబర్ ఆఫీసర్. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన అనిల్ అనే హమాలీ కార్మికుడు కూలీ ధ్రువీకరణ పత్రం కోసం లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రావును ఆశ్రయించాడు.
సర్టిఫికేట్ మంజూరు చేయాలంటే రూ.4 వేలు లంచం కావాలని ఆ ఆఫీసర్ డిమాండ్ చేయడంతో అనిల్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా స్కెచ్ గీసిన ఏసీబీ అధికారులు బుధవారం అనిల్ నుంచి లంచం తీసుకుంటుండగా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టుచేశారు.