
అక్టోబర్29న జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న లాలునాయక్ , హైదరాబాద్‌లో బీజేపీ తీర్థం పుచ్చుకున్న లాలునాయక్
సాక్షి, చందంపేట : లాలునాయక్... పదిహేను రోజుల్లో రెండు కండువాలు మార్చేశారు. మూడు పార్టీలు మారారు. లాలునాయక్ 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి దేవరకొండ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టికెట్ రాకపోవడంతో అక్టోబర్ 29న జానారెడ్డి, కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ పరిస్థితి ఆశాజనకం లేదని గ్రహించిన ఆయన గురువారం హైదరాబాద్‌లో ముఖ్యనాయకులతో కలిసి కాశాయం కండువా కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment