పెద్దగట్టు జాతరకు రూ. 2.10 కోట్లు విడుదల | Larger rehabilitation of Rs. 2.10 crore released | Sakshi
Sakshi News home page

పెద్దగట్టు జాతరకు రూ. 2.10 కోట్లు విడుదల

Published Sat, Dec 20 2014 2:34 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM

Larger rehabilitation of Rs. 2.10 crore released

సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలోని దూరజ్‌పల్లిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న పెద్దగట్టు జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 2.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, ఆలయ ముస్తాబు, రహదారులు, విద్యుదీకరణ ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. దేవాదాయ, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement