సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు ఎంసెట్, ఈసెట్, పాలిసెట్ చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం షెడ్యూలు జారీ చేసింది. ఎంసెట్ చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈనెల 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేసే గడువు బుధవారంతో ముగుస్తుందని, ఆ తర్వాత చివరి దశ కౌన్సెలింగ్ అందుబాటులో ఉండే సీట్ల వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు పూర్తి చేస్తామని వెల్లడించారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 12న చేపట్టి 15న సీట్ల కేటాయింపుతో పూర్తి చేస్తామని వివరించారు.
ఎవరెవరు చివరి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చంటే..
∙మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా.. ఫీజు చెల్లించకుండా, కాలేజీల్లో చేరని వారు. ∙ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ చేయించుకొని, మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నా సీటు లభించనివారు. ∙మొదటి విడతలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నా ఆప్షన్లు ఇచ్చుకోనివారు. ∙మొదటి విడతలో సీటు వచ్చి, ఫీజు చెల్లించి కాలేజీల్లో చేరినా.. మరింత మంచి కాలేజీ లు, కోర్సుల కోసం చివరి దశలో పాల్గొన వచ్చు. ∙మొదటి దశలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాని వారు, చివరి దశలో ఫ్రెష్‌గా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావచ్చు.
∙మొదటి దశలో ఇచ్చిన ఆప్షన్లు ఇపుడు పనికిరావు. తాజాగా మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ∙మొదటి దశలో సీటు పొంది, ఫీజు చెల్లించి, కాలేజీలో చేరిన వారు అదే కాలేజీలో ఉండాలనుకుంటే ఇపుడు అప్షన్లు ఇవ్వొద్దు. ∙మరో కాలేజీకి వెళ్లాలనుకుంటేనే ఇపుడు ఆప్షన్లు ఇవ్వాలి. ఒకవేళ ఇపుడు ఆప్షన్లు ఇస్తే మరో కాలేజీలో సీటు అలాట్ అయిందంటే మొదటి దశలో వచ్చిన సీటు రద్దవుతుంది. అది మరో విద్యార్థికి వెళుతుంది.
సెట్స్‌వారీగా షెడ్యూలు..
ఎంసెట్...
జూలై 19: సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూలై 19 – 20: వెబ్ ఆప్షన్లు
జూలై 22: సీట్ల కేటాయింపు ప్రకటన
ఈసెట్..
జూలై 18: సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూలై 18–19: వెబ్ ఆప్షన్లు
జూలై 21: సీట్ల కేటాయింపు ప్రకటన.
పాలిసెట్..
జూలై 12: సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూలై 12– 13: వెబ్ ఆప్షన్లు
జూలై 15: సీట్ల కేటాయింపు ప్రకటన.
చివరి దశ ప్రవేశాల షెడ్యూలు జారీ
Published Wed, Jul 12 2017 1:01 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement