భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ లీకేజీ | leakage of bhagyanagar gas pipeline | Sakshi
Sakshi News home page

భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ లీకేజీ

Published Fri, Mar 13 2015 9:36 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్  లీకేజీ - Sakshi

భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ లీకేజీ

రంగారెడ్డి: మేడ్చల్ - శామీర్‌పేట్ రోడ్డులోని మెడిసిటీ కూడలి వద్ద శుక్రవారం భాగ్యనగర్ సీఎన్‌జీ గ్యాస్ పైపులైను లీకయిన సంఘటన కలకలం సృష్టించింది. వివరాలు...మెడిసిటీ కూడలి వద్ద ఉన్న పైపులైను లీకవుతోందని అటుగా వెళ్తున్న రాజబొల్లారం గ్రామస్తులు చూసి భాగ్యనగర్ సీఎన్‌జీ గ్యాస్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పైపులైనును పరిశీలించారు. గ్యాస్ లీకవుతున్న చోట మరమ్మతులు నిర్వహించి, లీకేజీ కాకుండా నియంత్రించారు. దీంతో రాజబొల్లారం గ్రామస్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కొంతకాలంగా మేడ్చల్ పట్టణంతోపాటు మండలంలోని పలు ప్రాంతాల్లో లీకేజీ సవుస్యలు తలెత్తుతున్నాయి. భాగ్యనగర్ గ్యాస్ సిబ్బంది సకాలంలో లీకేజీలకు మరమ్మతులు చేస్తున్నప్పటికీ తరుచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
(మేడ్చల్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement