మేడ్చల్ లో పులి చర్మం స్వాధీనం
Published Tue, Jul 11 2017 1:19 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM
ఘట్‌కేసర్: మేడ‍్చల్ జిల్లా ఘట్కేసర్ లో చిరుతపులి చర్మాన్ని విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా అడవుల‍్లో పులిని చంపి చర్మాన్ని మరో ముఠాకు ఘట్‌కేసర్‌లో విక్రయించారు. విషయం తెలుసుకున‍్న ఘట్‌కేసర్ పోలీసులు పులిని చంపిన ఐదుగురిని, చర‍్మం విక్రయించిన 12 మందిని మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర‍్భంగా పులిచర్మాన్ని స‍్వాధీనం చేసుకున్నారు.
విద్యుత్ తీగతో చంపారు
గండి గోపాల్‌పూర్‌లో నీళ్ల కోసం వచ్చిన పులిని కరెంటు వైర్లుతో ఆరుగురు వ్యక్తులు చంపి దాని చర్మాన్ని విక్రయించే ప్రయత్నం చేశారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ విలేకరులకు తెలిపారు. వీరు పులి, అడవి పందులు, జింకలను కూడా చంపి వీటి చర్మాన్ని విక్రయించేవారన్నారు. పులి చర్మానికి అంతర్జాతీయ మార్కెట్ లో రూ.24 లక్షలు పైగా విలువ ఉంటుందన్నారు. 2016 మార్చిలో పులిని చంపి విక్రయించడానికి చాలామందిని ఫోన్‌లో సంప్రదించారని, ఇందులో కనక అనిల్, కనక శ్రీనివాస్, జ్యోతిరం, కనక జగ్గారావులు కీలక నిందితులని వివరించారు. నిందితుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని ఘట్‌కేసర్ వద్ద అరెస్టుచేశామన్నారు.
Advertisement