
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోరీ జరిగింది. లాక్ డౌన్ సమయంలో ఓ వైన్ షాప్ నిర్వాహకుడు అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని టూటౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టగా మాయం అయింది.
గుర్తు తెలియని వ్యక్తులు మద్యం ఎత్తుకెళ్లినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోనే చోరీ అంటే పరువు పోతుందని పోలీసులు నోరు విప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment