క్షమాపణ చెప్పినా, అర్థరాత్రి అరెస్ట్‌లా?: ఎమ్మెల్యే | mahabubabad mla shankar naik unhappy with arrest | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పినా, అర్థరాత్రి అరెస్ట్‌లా?: ఎమ్మెల్యే

Published Thu, Jul 13 2017 4:44 PM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

క్షమాపణ చెప్పినా, అర్థరాత్రి అరెస్ట్‌లా?: ఎమ్మెల్యే - Sakshi

క్షమాపణ చెప్పినా, అర్థరాత్రి అరెస్ట్‌లా?: ఎమ్మెల్యే

వరంగల్‌ : తాను కావాలని ఏ తప్పు చేయలేదని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆయనను స్థానిక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సొంత పూచీకత్తుపై బెయిల్పై విడుదలయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వివరణ ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంతమంది టీఆర్‌ఎస్‌ నేతలే తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  పార్టీ ఒత్తిడి మేరకే క్షమాపణ చెప్పానన్నారు. కలెక్టర్‌కు క్షమాపణ చెప్పినా రాత్రికి రాత్రే పోలీసులు తనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయడం బాధాకరమన్నారు. తనపై  కుట్ర చేసి ఏం సాధిస్తారని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అన్నారు. కలెక్టర్‌ తనకు సోదరి లాంటిదని, తాము ఇద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందినవారిమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్త..

ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్.. బెయిల్‌పై విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement