
ఆంధ్రప్రదేశ్
► ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది.
► మూడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ
► సామాజిక దూరం పాటిస్తూ ఉచిత రేషన్ తీసుకుంటున్న ప్రజలు
► రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా వాలంటీర్ల చర్యలు
► ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ
తెలంగాణ
► తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 77కు చేరింది.
► నేటి నుంచి జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ
► కరోనా ప్రొటెక‌్షన్ కిట్‌లు ఇవ్వడం లేదని నిరసన చేయనున్నట్లు ప్రకటించారు.
► నేటి నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
► సీసీఎంబీలో కరోనా పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
జాతీయం
► దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1347 మందికి చేరింది.
► దేశంలో కరోనా మరణాల సంఖ్య 43కు చేరింది.
► దేశంలో ఇప్పటివరకు కోలుకొని137 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అంతర్జాతీయం
► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 7.84 లక్షలు దాటింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల సంఖ్య 37,778కి చేరింది.
► ప్రపంచవ్యాప్తంగా 1,65,035 మంది కోలుకున్నారు.
► అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1,63,287కు చేరింది.
► అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3 వేలు దాటింది.