సాక్షి, మునుగోడు : తనపై నమ్మకం పెట్టుకొని డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో తనకు ఓటువేసి గెలిపిస్తే అభివృద్ధిలో వెనుకబాటుకు గురైన మునుగోడును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. మండలంలోని చొల్లేడు గ్రామంలో తన కార్యకర్తలతో కలిసి శనివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనతో పాటు బరిలో నిలిచిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులకు కనీసం నియోజకవర్గంలోని సమస్యలు కూడా తెలియవన్నారు. తాను ఒక్కడినే నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచారం చేస్తున్నానన్నారు. ఆ ఇరువురు అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు, మద్యం ఇచ్చి గెలుపొందేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.
వాటిని ఓటర్లు తిప్పికొట్టి అభివృద్ధిపరిచే తనకు ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. తాను గెలిచిన వెంటనే మునుగోడులో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలతో పాటు 30 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయిస్తానన్నారు. అంతే కాకుండా ఎలాంటి సాగు నీటి వనరులు లేని ఈ ప్రాంతానికి నక్కలగండి ప్రాజెక్టు పనులు పూర్తి చేయించి సాగు నీరు అందించి ఫ్లోరిన్ సమస్యను పరిష్కరిస్తానన్నారు.
రెండు నెలల క్రితం వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన కూసుకుంట్ల పోలీసు పహారాలో ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. ఎవ్వరూ ఎన్ని ఎత్తులు వేసినా మునుగోడులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శులు వేదాంతం గోపినాథ్, దర్శం వేణు, రాష్ట్ర నాయకులు భవనం మధుసూదన్‌రెడ్డి, దుబ్బ జెల్లయ్య, పార్టీ మండల అధ్యక్షుడు బొడిగే అశోక్‌గౌడ్, నాయకులు నకిరకంటి నర్సింహగౌడ్, పర్నె అంతిరెడ్డి, బొల్గూరి రమేష్, మాదగోని నరేందర్‌గౌడ్, ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, నీరుడు రాజారాం, జానయ్య, మేక మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి
బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. మండంలోని కల్వకుంట్ల, మునుగోడు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు శనివారం బీజేపీలో చేరగా వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో రేవెల్లి గణేష్, సత్యనారాయణ, భీమనపల్లి రాంబాబు, రేవెల్లి వెంకన్న, భీమనపల్లి స్వామి, రేవెల్లి శివ, వెంకన్న, రమేష్, పందుల రాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment