తాండూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడలో శుక్రవారం వెలుగుచూసింది. ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని గోండియా జిల్లాకు చెందిన గులాబ్(35) స్థానిక శ్రీనివాస సిరామిక్స్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గులాబ్ తనతో పాటు ఉంటున్న మహిళను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె పక్క ఇంట్లోకి వెళ్లి నిద్రపోయింది. అనంతరం చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.