సాక్షి, నిజామాబాద్: నేటి యాంత్రిక యుగంలో అంతా చరవాణి మాయ కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల యుగం నడుస్తోంది. ఫోన్ చేతిలో ఉంటే చాలు సెల్ఫీచిత్రాలు, వీడియోలు వంటి ఇతరాత్ర ఫీచర్‌లకు అలవాటు పడిపోయారు ప్రజలు. స్మార్ట్‌ఫోన్‌లను తదేకంగా వినియోగిస్తూ తమ పక్కన ఉన్నవారిని కూడా పట్టించుకోవడం లేదు. సోషల్‌మిడియాలో ఎన్నో కొత్త కొత్త ఫీచర్‌లు వస్తున్నాయి. పోతున్నాయి. తాజాగా సోషల్ మిడియాలో బాగా క్రేజ్ ఉన్న ‘టిక్‌టాక్’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌టాక్ ఇప్పుడు ప్రాణాల మీదికి తెస్తోంది. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో టిక్‌టాక్ బాదితులు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. విద్యార్థులు చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. గృహిణిలు శారీరకంగా, మానసికంగా నష్టపోతున్నారు.
సరదా కాస్త హద్దు మీరితే..
టిక్‌టాక్ యాప్ అనేది వినియోగదారులు 15 సెంకడ్ల షాట్ లూపింగ్ వీడియోలు, చిన్న మ్యూజిక్ వీడియోలను సృష్టించేందుకు ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ పరిమాణం 72 ఎంబీ. 38 భాషలు అందుబాటులో ఉంటాయి. తమ అభిమాన నటులు, అభిమాన రాజకీయనాయకుల డైలాగులు, సినిమా పాటలు, డ్యాన్సులు ఇలా రకరకాలుగా టిక్‌టాక్ వీడియోలు చేసి పోస్ట్‌లు పెడుతున్నారు. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి జాడ్యంల మారి జీవితాల్లో చిచ్చు పెడుతుంది. కొన్ని రోజులు నగరానికే పరిమితమైన టిక్‌టాక్ వ్యాపకం గ్రామగ్రామానికి విస్తరించింది. లైక్‌లు, కామెంట్‌ల కోసం చాలా మంది రకరకాల వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు. ఎక్కువ లైక్‌ల కోసం అశ్లీలంగా మాట్లాడం, నృత్యాలు కూడా చేస్తున్నారు. వివాహిత స్త్రీ, పురుషులు సహితం ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయటంతో అవి వైరల్ అయి చివరికి భాగస్వామితో ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఇది కాస్త ఇంట్లో గొడవలు.. హత్యలు.. ఆత్మహత్యలకు కారణమవుతుంది.
ఇప్పటిదాకా జరిగిన అనర్థాలు
1) టిక్‌టాక్ మోజులో బీంగల్ మండలం గొనుగొప్పుల కప్పలవాగు చెక్‌డ్యాంలో ముగ్గురు స్నేహితులు టిక్‌టాక్ రికార్డు చేస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ముగ్గురు వాగులో కొట్టుకుపోయారు. అయితే స్థానికులు ఇద్దరు యువకులను కాపాడగా దినేష్ మాత్రం గల్లంతయ్యాడు రెండు రోజుల క్రితం గల్లంతు అయిన దినేష్ మృతదేహం ఆదివారం కనుగొన్నారు.
2) టిక్‌టాక్ చేస్తూ బీహార్‌లో ఒక యువకుడు మిత్రులతో కలిసి వరద నీటి ప్రవాహంలో సాహసాలు చేస్తూ వరద ఉధృతికి మృత్యువాత పడ్డాడు.
3) హైదరాబాద్‌లో ఒక వ్యక్తి మరో మహిళతో కలిసి చేసిన ఆశ్లీల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్త ఆయన భార్యకి తెలిసి ఆమె చేత చెప్పుదెబ్బలు తినాల్సి వచ్చింది.
4) తమిళనాడుకు చెందిన ఒ వివాహిత టిక్‌టాక్ చేసేందుకు తన భర్త అంగీకరించటం లేదని ఆత్మహత్య చేసుకుంది.
5) ఖమ్మం కార్పొరేషన్‌లో 9 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు టిక్‌టాక్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా ప్రతిరోజు టిక్‌టాక్ కారణంగా రాష్ట్రంలోనే కాదు దేశ వ్యా ప్తంగా ఎన్నో అనర్దాలు జరుగుతున్నాయి.
తప్పు చేస్తే జైలుకే..
టిక్‌టాక్ యాప్ ద్వారా యువత భవిష్యత్తు అంధకారం వైపు పయణిస్తుంది. సమాజంపై కనీస అవగాహన లేని వారు చేసే వీడియోలు వారిని కటకటాల పాలు చేస్తున్నాయి. సామాజిక మధ్యమాల్లో ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించిన కామెంట్లు, వీడియోల రూపంలో అసభ్యకరంగా ప్రవర్తించిన దానిని నేరంగా పరిగణిస్తారు.
ఆరోగ్యంపై ప్రభావం
సెల్‌ఫోన్ జీవితంగా భావిస్తూ ఆరోగ్యాన్ని చే తులారా నాశనం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలకు అ లవాటు పడే నిద్రలేక అనారోగ్యం, మా నసిక ఒత్తిడితో బాధ పడుతున్నారు. తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలకు, యు వతకు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి.
– శ్రీనివాస్ శర్మ, గాజుల్‌పేట
మానసిక రుగ్మత
మానసిక రుగ్మతులకు కారణమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు టిక్‌టాక్ యాప్‌లను ప్రభుత్వం నిషేదించాలి. మంచి కోసం ఫోన్ వినియోగిస్తే అంతా మంచే. కాని మహిళలు, యువత క్షణక్షణం ఫోన్ వినియోగిస్తున్నారు.
– సూర్యప్రకాష్‌రెడ్డి, గంగాస్థాన్
Comments
Please login to add a commentAdd a comment