పాణం తీసిన సెల్ఫీ | Man death attempting selfie | Sakshi
Sakshi News home page

పాణం తీసిన సెల్ఫీ

Published Tue, Jan 15 2019 3:46 AM | Last Updated on Tue, Jan 15 2019 3:47 AM

Man death attempting selfie - Sakshi

చిల్పూరు: సెల్ఫీ మోజు ఓ యువకుడిని బలి తీసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మం డలం మల్లన్నగండి వద్ద సోమవారం చోటుచేసుకుంది. సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన హరికృష్ణ ఓ ప్రయివేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. సంక్రాంతి సెలవుల సందర్భంగా గ్రామానికి వచ్చిన అతను సోమవారం ఉదయం స్నేహితులైన మధు, సాయితేజ, శేఖర్, కిషోర్, సాయికుమార్‌లతో కలసి చుట్టుపక్కల రిజర్వాయర్లను చూసుకుంటూ మల్లన్నగండికి చేరుకున్నారు.

అక్కడ కాసేపు సరదాగా తిరిగారు. చివరకు ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి మల్లన్నగండిలోకి నీరు పోస్తున్న పైప్‌లైన్‌ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న స్థానికులు పైకి ఎక్కి ఫొటోలు దిగవద్దని వారించి వెళ్లి పోయారు. అయినా వినకుండా సెల్ఫీ దిగేందుకు ఎక్కారు. హరికృష్ణ సెల్ఫీ తీసేందుకు అందరిని ఒకదగ్గరకు రమ్మంటూ వెనక్కి జరగడంతో ప్రమాదవశాత్తు జారీ రిజర్వాయర్లో పడి పోయాడు. అతని స్నేహితులు వెంటనే సమీపంలో ఉన్న రైతులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు తెలిపారు. మృతదేహం కోసం గాలించినా ఫలితం దక్కలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement