ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గండి వద్ద శనివారం జరిగింది.
నిజామాబాద్ : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గండి వద్ద శనివారం జరిగింది.
ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పోచయ్య(40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.