నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.
సదాశివనగర్(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. తాడ్వాయి మండలం కన్‌కల్ గ్రామానికి చెందిన మందుల సాయిలు(45) వ్యక్తిగత పని నిమిత్తం శనివారం ఉదయం సదాశివనగర్ మండలం కుప్రియాల్ వెళ్లాడు. బస్సు దిగి 44వ నంబర్ జాతీయ రహదారిని దాటుతుండగా ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో సాయిలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.