ఉద్యోగం లేదని మానసిక ఒత్తిడికి గురై ఓ వ్యక్తి యాసిడ్‌తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
చిలకలగూడ (హైదరాబాద్): ఉద్యోగం లేదని మానసిక ఒత్తిడికి గురై ఓ వ్యక్తి యాసిడ్‌తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పద్మారావునగర్ స్కందగిరి ఆలయం సమీపంలో నివసిస్తున్న ఎస్.రవి (40) ఉద్యోగం లేదని కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో యాసిడ్ తాగాడు. అదే సమయంలో బయటకు వెళ్లిన భార్య ప్రీతి ఫోన్ చేయగా తాను యాసిడ్ తాగానని చెప్పాడు.
ప్రీతి వెంటనే ఇంటికి వచ్చి చూడగా రవి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. బంధువుల సహాయంతో రవిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతు సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు.