వివాహిత ఆత్మహత్యాయత్నం | Married commit suicide In Nalgonda district | Sakshi

వివాహిత ఆత్మహత్యాయత్నం

Published Tue, Feb 5 2019 3:35 PM | Last Updated on Tue, Feb 5 2019 3:35 PM

Married commit suicide In Nalgonda district - Sakshi

నల్గొండ /వేములపల్లి : సాగర్‌ ఎడమకాల్వలో వివాహిత మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన సోమవారం మండలంలోని శెట్టిపాలెం గ్రామశివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీలో నివసిస్తున్న నవీన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. అనారోగ్యంతో ఉన్న ఆమె కుటుంబానికి భారం కాకూడదనే ఆలోచనతో శెట్టిపాలెం శివారులోని ఎడమకాల్వలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన యువకులు కాల్వలోకి దూకి మహిళను ఒడ్డుకు చేర్చారు. మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించి బాధిత మహిళకు కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement