![హామీలు నెరవేర్చడంలో విఫలం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51423991115_625x300.jpg.webp?itok=leyxbIY9)
హామీలు నెరవేర్చడంలో విఫలం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్మిక విభాగం జెండాను వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రైతులు ఎంత ముఖ్యమో..కార్మికులూ అంతే ముఖ్యమని పొంగులేటి తెలిపారు. తమ పార్టీ పేరులోనే శ్రామికుల ప్రస్ధావన ఉందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. మేడే వేడుకల్లో పలువులు తెలంగాణ వైస్ఆర్ సీపీ నేతలు పాల్గొన్నారు.