ఎంపీ సీతారాంనాయక్
హన్మకొండ సిటీ : ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణా ల మాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మొదటి దశలో రైతుల రుణమాఫీకి రూ.4.250 కోట్లు విడుదల చేశారని, మిగతా మొత్తానికి బాండ్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మూడేళ్ల నాటి ఇన్‌పుట్ సబ్సిడీ రూ.450 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు.
ఇన్‌పుట్ సబ్సిడీపై అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని హరీష్‌రావు నిలదీస్తే, ఒక్క రూపా యి ఇవ్వమని చెప్పారని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణకు చెం దిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ సర్కారు వంద రోజు ల్లో చేసిందేమి లేదని కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు రుణమాఫీపై నానా హంగామా చేశారని, ఇప్పుడేం మాట్లాడుతారని ప్రశ్నించారు. మార్నేని రవీందర్‌రావు, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
మాట తప్పని కేసీఆర్
Published Tue, Sep 23 2014 2:37 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
Advertisement
Advertisement