
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమితులైన బండా శివానందప్రసాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైకోర్టులోని తన కార్యాలయంలో సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయవాదులు అభినందించారు. అనంతరం తెలంగాణ, హైకోర్టు న్యాయవాదుల సంఘాలు బీఎస్ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించాయి. తనను ఏజీగా నియమించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇరు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.