కాంగ్రెస్‌ను పాతిపెట్టాలి
- అప్పుడే బంగారు తెలంగాణ
- మంత్రి కేటీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్: పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుప డుతున్న కాంగ్రెస్‌ను పాతాళంలో పాతిపెట్టాలని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్య మవుతుందని మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. సమైక్య పాలనలో దగాపడ్డ పాలమూరులోని బీడు భూములకు కృష్ణా జలాలు పారించాలని సీఎం పనులు చేస్తుంటే పాలమూరు నాయకులే అడ్డుపడు తున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పనులు జరగకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. శనివా రం మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా 337 గ్రామాలకు తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహబూబ్‌నగర్, నారాయ ణపేట పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ స¿భల్లో మాట్లాడారు.
మీ ఆశీర్వాదంతోనే తెలంగాణ..
సమైక్య రాష్ట్రంలో అత్యంత దగాకు గురైన పాలమూరును అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లే వరకు విశ్రమించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదం వల్లే కేసీఆర్ తెలంగాణ సాధించారని తెలిపారు. ‘‘గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఎగువ కృష్ణా ప్రాజెక్టు నిర్మించి పాలమూరు ప్రాంతంలో 17.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అదే సమయం లో తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల ఆ ప్రాజెక్టు కలగా మిగిలిపోయింది. దాంతో 60 ఏళ్ల పాటు పాలమూరు ప్రజలు వలసల పాల య్యారు. పాలమూరును దత్తత తీసుకున్నా మని చెప్పిన వ్యక్తులు కూడా మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఇక్కడి కరువును చూపి ప్రపంచ బ్యాంకు వద్ద అప్పులు తెచ్చి ఆంధ్రా లో ఖర్చు పెట్టిన ఘనత టీడీపీ నేతలది.
పాలమూరు పచ్చబడేందుకు బీడుపడిన పొలాలకు కృష్ణా నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో పనులు చేస్తుంటే.. పాలమూరు నాయకులే అడ్డుపడుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు జరగకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. రూ.40 వేల కోట్ల ఖర్చుతో మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని భావించారు. కానీ ఇక్కడి నాయకుల వల్లే అటంకాలు ఎదురవుతున్నాయి. అలాంటి నేతలను ప్రజలే తరిమికొట్టాలి’’అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమాన్ని పరుగు పెట్టిస్తున్నాం...
ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. ఏటా రూ.5,300 కోట్లు ఖర్చు చేసి 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తోందని, పేద వారికి ఇచ్చే బియ్యంపై సీలింగ్ ఎత్తివేసిం దన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, చేనేతల కోసం సబ్సిడీ నూలు, కుల వృత్తుల కోసం గొర్రెలు, చేపల పంపిణీ వంటి పథకాలు ప్రవేశపెట్టినట్టు వివరిం చారు. అన్ని ప్రాంతాలకు సమానంగా అందజేస్తున్నామని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.