స్టాక్ రికార్డు, హాజరుపట్టిక పరిశీలన
కరకగూడెం జెడ్పీఎస్‌ఎస్ సందర్శన
పినపాక : ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల కు మెరుగైన వైద్య సేవలందించాలని పినపాక ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు వైద్యులు, సిబ్బందికి సూ చించారు. మండలంలోని కరకగూడెం ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అనంతరం స్టాక్ రికార్డును, హాజరుపట్టికను పరిశీలించారు. దూ ర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు వెంటనే వైద్య సేవలందించాలని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా అన్ని సేవలు అందించాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల తనిఖీ..
కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే పాయం తనిఖీ చేశారు. హెచ్‌ఎం శ్రీలత ను పాఠశాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. మరుగుదొడ్లు, మూత్రాలలు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నట్లు విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట వాపోయూరు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని పాయం హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉడుముల లక్ష్మీరెడ్డి, ఏడూళ్లబయ్యారం ఎస్సై జీడి సూర్యప్రకాష్, కరకగూడెం సర్పంచ్ వట్టం సమ్మక్క, ఎస్‌ఎంసీ చైర్మన్ జలగం కృష్ణ, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు సారా సాంబశివరావు, పోగు వెంకటేశ్వర్లు, ముద్దం సూర్యనారాయణ, అజ్జు, గొగ్గలి రవి, ఎర్రా సురేష్, బాతిని మురళి, జాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీలో ‘పాయం’ తనిఖీలు
Published Sat, Aug 8 2015 2:41 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement