MLA payam venkateswarlu
-
మావోయిస్టు కరపత్రాల కలకలం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. గురువారం మావోయిస్టులు కరపత్రాల ద్వారా కొంతమంది ప్రజాప్రతినిధులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరులతో పాటు మరి కొంతమందిని మావోయిస్టులు హెచ్చరించారు. ‘విజయనగరం గ్రామంలో ఇసుక దందా, భూ సెటిల్మెంట్స్, భూకబ్జాలకు పాల్పడుతూ.. కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న ఎనిమిది మందికి వార్నింగ్. పద్ధతి మార్చుకోకపోతే ఏరివేత తప్పద’ని కరపత్రాలలో పేర్కొన్నారు. మావోయిస్టు చర్ల, దుమ్ముగూడెం ఏరియా కార్యదర్శి పేరిట ఈ కరపత్రాలు వెలిశాయి. -
డబుల్ బెడ్రూం ఇళ్లపై పునరాలోచించండి
♦ బడ్జెట్‌పై చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ♦ గ్రామాల్లో పేదలు తమ స్థలంలోనే ఇళ్లు కట్టుకునేలా వెసులుబాటు కల్పించాలి ♦ సీతారామ, రామదాసు ప్రాజెక్టులపై సందేహాలున్నాయ్ సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లను ఒకేతీరుగా నిర్మించాలనే ప్రణాళికపై ప్రభుత్వం పునరాలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. హైదరాబాద్‌లో ఒకే నమూనా అమలుకు ఇబ్బంది లేదని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో తమకున్న స్థలంలో పేదలు ఇళ్లు కట్టుకునేలా వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. దాదాపు నాలుగులక్షల మందికి పెండింగ్‌లో పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కరువు, దుర్భిక్ష పరిస్థితులు, ఎండలు మండుతున్నందున రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులకు భరోసానివ్వాలని ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక కమిటీ వేసి ఈ నిధులు ఖర్చు చేయాలని, మైనారిటీలు, బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానం మేరకు ప్రతి గిరిజన కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులపై పలు సందేహాలు ఉన్నాయని, వాటిపై నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్లపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇవ్వాలని కోరారు. బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేనంతగా 51శాతం ప్రణాళిక వ్యయాన్ని చూపిం చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలో.. జాలిపడాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. భారీగా వేసుకున్న ఆదాయపు అంచనాలన్నీ ప్రభుత్వ ప్రగల్భాలుగానే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ వైఫల్యం వల్లే రైతు ఆత్మహత్యలు
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. రుణమాఫీ చేయకపోవడం వల్లే రైతాంగ సంక్షోభం నెలకొందని ఆయన అన్నారు. వెంటనే రుణమాఫీ చేయడంతో పాటు కరువు మండలాలను ప్రకటించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పెండింగులో ఉన్న హౌసింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. -
పీహెచ్సీలో ‘పాయం’ తనిఖీలు
స్టాక్ రికార్డు, హాజరుపట్టిక పరిశీలన కరకగూడెం జెడ్పీఎస్ఎస్ సందర్శన పినపాక : ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల కు మెరుగైన వైద్య సేవలందించాలని పినపాక ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు వైద్యులు, సిబ్బందికి సూ చించారు. మండలంలోని కరకగూడెం ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అనంతరం స్టాక్ రికార్డును, హాజరుపట్టికను పరిశీలించారు. దూ ర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు వెంటనే వైద్య సేవలందించాలని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా అన్ని సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల తనిఖీ.. కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే పాయం తనిఖీ చేశారు. హెచ్ఎం శ్రీలత ను పాఠశాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. మరుగుదొడ్లు, మూత్రాలలు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నట్లు విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట వాపోయూరు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని పాయం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉడుముల లక్ష్మీరెడ్డి, ఏడూళ్లబయ్యారం ఎస్సై జీడి సూర్యప్రకాష్, కరకగూడెం సర్పంచ్ వట్టం సమ్మక్క, ఎస్ఎంసీ చైర్మన్ జలగం కృష్ణ, వైఎస్సార్సీపీ మండల నాయకులు సారా సాంబశివరావు, పోగు వెంకటేశ్వర్లు, ముద్దం సూర్యనారాయణ, అజ్జు, గొగ్గలి రవి, ఎర్రా సురేష్, బాతిని మురళి, జాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ వార్డెన్‌పై ఎమ్మెల్యే ‘పాయం’ ఆగ్రహం
మెనూ పాటించడం లేదని మండిపాటు ఎస్సీ బాలుర హాస్టల్ ఆకస్మిక తనిఖీ ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించిన విద్యార్థులు మణుగూరు : ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం విద్యార్థులకు పెట్టాలని మెనూ సక్రమంగా పాటించని వార్డెన్‌నుపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహించారు. ఈ మేరకు గురువారం ఉదయం మణుగూరు ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి హాస్టల్లో వార్డెన్ లేకపోవడంతో మీరు లేకుండా విద్యార్థులు ఎలా ఉంటారని వార్డెన్‌ను ప్రశ్నించారు. విద్యార్థులకు వండిన వంటను పరిశీలించారు. చారు నీళ్లలా ఉందని, మెనూ ప్రకారం తమకు భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే హాస్టల్ రికార్డులను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో ఉన్న సామాన్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తమకు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో భోజనాలు పెట్టడం లేదని ఎస్ఎంహెచ్ హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. హాస్టల్లో తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవని విద్యార్థులు ఆయనకు తెలిపారు. సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు హాస్టల్ వార్డెన్ కృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వట్టం రాంబాబు, మండల గౌరవ అధ్యక్షుడు పల్లపు తిరుమలేశ్, కార్యదర్శి గాండ్ల సురేష్, జిల్లా నాయకులు పెద్ది నాగకృష్ణ, మండల యూత్ నాయకుడు రంజిత్, నాయకులు మేడ నాగేశ్వరరావు, జె సురేష్ వార్డు సభ్యులు మిట్టపల్లి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పార్టీ ద్రోహులకు ప్రజలే బుద్ధి చెబుతారు
బూర్గంపాడు : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి ద్రోహం చేసినవారికి ప్రజలే బుద్ధిచెబుతారని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం బూర్గంపాడు మండల ప్రజాపరిషత్ నూతన పాలకవర్గ అభినందనసభ సంజీవరెడ్డిపాలెంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అధికారపార్టీ ప్రలోభాలను లెక్కచేయకుండా మండల పరిషత్ పాలకవర్గ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు పాటుపడ్డ ఎంపీటీసీ సభ్యులకు, పార్టీనాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఏడాదిక్రితం ఎన్నికలు జరిగినప్పుడే పాలకవర్గ ఏర్పాటుకు వైఎస్సార్సీపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉందని, కొన్ని కారణాలతో పాలకవర్గ ఎన్నిక నిర్వహణలో జాప్యం జరిగిందన్నారు. దీనిని సాకుగా చూపి కొందరు స్వార్థపరులు అధికారం కోసం పాలకవర్గం పంచనచేరి కుట్రలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నిస్వార్థపరుడికి ఎంపీపీ పీఠం దక్కలాని ఎంపీటీసీ సభ్యులు పార్టీలకు అతీతంగా వైఎస్సార్సీపీకి మద్దతుపలికి కైపు రోశిరెడ్డిని ఎంపీపీగా గెలిపించటం అభినందనీయమన్నారు. రాజకీయప్రస్థానంలో కష్టాలు, సుఖాలు రెండు ఉంటాయని, అన్నివేళలా ప్రజాశ్రేయస్సు కోరేవారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ దంపతులను, ఎంపీటీసీ సభ్యులను, జెడ్పీటీసీని ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ కొనకంచి బసంతీదేవి, పార్టీ రాష్ట్రనాయకులు ఆకుల మూర్తి, నిరంజన్‌రెడ్డి, భీమా శ్రీధర్, బిజ్జం శ్రీనివాసరెడ్డి, వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కైపు సుబ్బరామిరెడ్డి, భూపెల్లి నర్సింహారావు, మారం శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జక్కం సర్వేశ్వరరావు, ముడావత్ రామదాసు, అజ్మీరా వసంత, చింతా కోటేశ్వరి, తుమ్మల పున్నమ్మ, పాటి భిక్షపతి, అంగోతు సునీత, భూక్యా భీమ్లా, మహ్మద్ అబ్ధుల్ఘని తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు న్యాయం చేయూలి
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు : ఏజెన్సీలోని నిరుపేదలందరికీ ప్రభుత్వం తగిన న్యాయం చేయూలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో 56 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏడాదిగా మోతె సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న గిరిజనులలో 56 మందికి ప్రభుత్వం సారపాకలో స్థలాలు కేటాయించటం శుభపరిణామమన్నారు. అర్హులైన కొందరు తమకు ఇళ్ల స్థలాలు రాలేదని తెలిపారని, వారికి కూడా న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి జిల్లాలో 32వేల మంది గిరిజనులకు 2.50 లక్షల ఎకరాల భూమికి అటవీ హక్కు పట్టాలు ఇప్పించారన్నారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. తహసీల్దార్ అమర్నాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, సర్పంచ్‌లు ధరావత్ చందునాయక్, బానోతు సరోజ, పుట్టి కుమారి, వైస్ ఎంపీపీ కొనకంచి బసంతీదేవి, ఎంపీటీసీ సభ్యులు జక్కం సర్వేశ్వరరావు, ముడావత్ రామదాసు, చింతా కోటేశ్వరి, తుమ్మల పున్నమ్మ, అజ్మీరా వసంత, పాటి బిక్షపతి, భూక్యా భీమ్లా, అంగోతు సునీత, వై.వెంకటేశ్వర్లు, తోటమళ్ల సరిత, ఎన్డీ నాయకులు ముత్యాల సత్యనారాయణ, ఆర్ఐలు సునీత ఎలిజబెత్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా.. మణుగూరు : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తునట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. కమలాపురం, చినరాయిగూడెం గ్రామాల్లో రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయూ గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సైడ్ కాల్వలు, తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించారు. త్వరలో వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎ.సంపత్‌కుమార్, ఐటీడీఏ ఏఈ ప్రసాద్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొనకంచి శివయ్య, కార్యదర్శులు తూపుడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు పల్లపు తిరుమలేష్, ఆదిరెడ్డి, కోల్లు శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు జక్కం రంజిత్‌కుమార్, హుస్సేన్ అహ్మద్, హరగోపాల్, కుంజా నాగేశ్వరరావు, పెద్ది నాగకృష్ణ, మేడ నాగేశ్వరరావు, పి.సత్తిబాబు, మహిళా నాయకులు పాల్వంచ సుజాత, కొల్లు సుజాత, గద్దల ఆదిలక్ష్మి, కె.మానస, గద్దల రాము పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వల్లే ఆత్మహత్యలు
శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల ⇒ రైతుల ఆత్మహత్యలను మాకు అంటగట్టడమేమిటి? ⇒ మేం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చాం ⇒ గతంలో కంటే ఎక్కువగా ‘ఆసరా’ కల్పిస్తున్నాం ⇒ అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు ⇒ గాంధీ జెండా కప్పుకొని.. దానికి తూట్లు పొడిచారని వ్యాఖ్య.. నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పేద రాష్ట్రం కాదని, సుసంపన్నమైన రాష్ట్రమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్ని అవరోధాలు, ఆటంకాలున్నా.. ఉన్నంతలో ఉత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రమైనా, అనుభవం లేకున్నా.. జిమ్మేదారీతనంతో కేటాయింపులు చేశామన్నారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఈటెల మాట్లాడారు. తమ తొలి బడ్జెట్ అంచనాల్లో 80 శాతం లక్ష్యాన్ని అందుకున్నామని.. అందుకే అంచనాల్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు బడ్జెట్ పత్రాలను చదువుకొని వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమెవరని, గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ఈటెల ప్రశ్నించారు. గత ప్రభుత్వాల సరళీకృత విధానాలు, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ రైతుల ఉసురు పోసుకున్నాయని వ్యాఖ్యానించారు. ముక్కు నేలకు రాస్తా.. ఆంధ్రా సర్కారు కక్షతో కరెంటు ఇవ్వకపోయినా.. వ్యవసాయానికి రెండు విడతలుగా ఆరు గంటల విద్యుత్ అందిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేకపోతే పసిపిల్లలను చెట్లకు ఉయ్యాలలో వేయాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు. ‘‘గతంలో ఏప్రభుత్వమైనా జెన్కో, ట్రాన్స్‌కోల్లో ఒక్క రూపాయైనా పెట్టుబడి పెట్టిందా? పెట్టుబడులు పెట్టి ఉంటే ముక్కు నేలకు రాస్తా. వ్యవసాయానికి కేవలం 2 శాతం నిధులు కేటాయించామనడం భావ్యమేనా..? వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ. 9,156 కోట్లు.. అంటే ప్రణాళికా వ్యయంలో 18 శాతం కేటాయించాం.. రైతు రుణాల మాఫీకి మొదటి విడతగా ఒకేసారి రూ. 4,250 కోట్లు విడుదల చేస్తే.. అభినందించాల్సింది పోయి విమర్శలా..’’ అని ఈటెల మండిపడ్డారు. ‘‘నీలం తుపాన్లో నష్టపోయిన తెలంగాణ రైతులు నాలుగేళ్లు వేడుకున్నా చెల్లించని రూ. 480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఒకే జీవోలో ఇచ్చాం. అప్పట్లో అది అడగడానికి వెళితే ఇదే శాసనసభలో చాంబర్ ముందు బూటు కాళ్లతో తన్నుకుంటూ పోయిన ప్రభుత్వం మీది కాదా..?’’ అని ఆర్థిక మంత్రి నిలదీశారు. గాంధీ జెండా కప్పుకొని.. ఆ జెండాకు తూట్లు పొడిచిన సంస్కృతి మీదంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జాతిపిత గాంధీ తమ నాయకుడని.. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వకుండా.. విమర్శల దాడి చేయటం తగదన్నారు. కాగా.. వేములవాడ దేవస్థానం అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించాలని వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్. రమేష్ కోరారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలోని షావలి దర్గా, జహంగీర్ పీర్ దర్గాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. నక్కలగండి-దిండి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు సరిగా లేదని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. పదేళ్ల సడలింపునకు సిద్ధం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల్లో వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. దీనిపై బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఈటెల సమాధానమిచ్చారు. ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లు సడలించేందుకు అభ్యంతరం లేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి రామచంద్రమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు. ఏజెన్సీలో ఎస్సీలకురూ. 5 లక్షలు డిపాజిట్ ఎమ్మెల్యే పాయం డిమాండ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితులకు మూడెకరాల భూమి ఇచ్చే పరిస్థితి లేనందున.. వారి పేరున రూ. 5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి, వడ్డీని పొందేలా ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 525 దళిత కుటుంబాలకు ఐదేసి ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమిని కేటాయించిందని.. అయితే ఏజెన్సీల్లో నివసించే దళితులకు ఆ అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎస్టీలకు కూడా మూడెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, అంగన్వాడీ వర్కర్ల తరహాలో ఆశ వర్కర్లకు కూడా జీతాలు పెంచాలని పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. -
హామీల అమలులో కేసీఆర్ సర్కార్ విఫలం
-వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్ : ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీల అమలులో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో సర్కార్ వైఫల్యం చెందడంతో పాటు వాటిని నిర్లక్ష్యం చేస్తుందని వెంకటేశ్వర్లు ఈ సంర్భంగా అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ సర్కార్‌ను నిలదీస్తామని ఆయన తెలిపారు.