ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు : ఏజెన్సీలోని నిరుపేదలందరికీ ప్రభుత్వం తగిన న్యాయం చేయూలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో 56 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏడాదిగా మోతె సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న గిరిజనులలో 56 మందికి ప్రభుత్వం సారపాకలో స్థలాలు కేటాయించటం శుభపరిణామమన్నారు. అర్హులైన కొందరు తమకు ఇళ్ల స్థలాలు రాలేదని తెలిపారని, వారికి కూడా న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి జిల్లాలో 32వేల మంది గిరిజనులకు 2.50 లక్షల ఎకరాల భూమికి అటవీ హక్కు పట్టాలు ఇప్పించారన్నారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. తహసీల్దార్ అమర్‌నాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, సర్పంచ్‌లు ధరావత్ చందునాయక్, బానోతు సరోజ, పుట్టి కుమారి, వైస్ ఎంపీపీ కొనకంచి బసంతీదేవి, ఎంపీటీసీ సభ్యులు జక్కం సర్వేశ్వరరావు, ముడావత్ రామదాసు, చింతా కోటేశ్వరి, తుమ్మల పున్నమ్మ, అజ్మీరా వసంత, పాటి బిక్షపతి, భూక్యా భీమ్లా, అంగోతు సునీత, వై.వెంకటేశ్వర్లు, తోటమళ్ల సరిత, ఎన్డీ నాయకులు ముత్యాల సత్యనారాయణ, ఆర్‌ఐలు సునీత ఎలిజబెత్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా..
మణుగూరు : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తునట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. కమలాపురం, చినరాయిగూడెం గ్రామాల్లో రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయూ గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సైడ్ కాల్వలు, తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించారు.
త్వరలో వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎ.సంపత్‌కుమార్, ఐటీడీఏ ఏఈ ప్రసాద్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొనకంచి శివయ్య, కార్యదర్శులు తూపుడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు పల్లపు తిరుమలేష్, ఆదిరెడ్డి, కోల్లు శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు జక్కం రంజిత్‌కుమార్, హుస్సేన్ అహ్మద్, హరగోపాల్, కుంజా నాగేశ్వరరావు, పెద్ది నాగకృష్ణ, మేడ నాగేశ్వరరావు, పి.సత్తిబాబు, మహిళా నాయకులు పాల్వంచ సుజాత, కొల్లు సుజాత, గద్దల ఆదిలక్ష్మి, కె.మానస, గద్దల రాము పాల్గొన్నారు.
నిరుపేదలకు న్యాయం చేయూలి
Published Fri, Jul 10 2015 4:20 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement