తెలంగాణలో స్థానిక సంస్థలకోటా శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థలకోటా శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికి డిసెంబర్ 2న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. నామినేషన్లకు చివరి తేదీ డిసెంబర్ 9. పరిశీలన 10న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ 12వ తేదీ. పోలింగ్ 27న జరుగుతుంది. డిసెంబర్ 30వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది.
హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు రెండేసి చొప్పున, మిగిలిన జిల్లాలకు ఒకటి చొప్పున మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.